టెలి కమ్యూనికేషన్ యాక్ట్ కింద వ్యక్తి అరెస్ట్
మంగళగిరి టౌన్ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన రాహుల్ కుమార్ సాహిని టెలి కమ్యూనికేషన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మంగళగిరి ఆటోనగర్‌లో ఓ డేటా సెంటర్‌లోని సర్వర్ సహాయంతో రాహుల్ సీబీపీఈ ఆప్టిమైజ్డ్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతను అంతర్జాతీయ కాల్స్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ఢిల్లీకి గత ఆరు నెలల్లో 70 ఫిర్యాదులు అందాయి. దీంతో టెలి కమ్యూనికేషన్‌సంస్ధ విచారణ చేపట్టింది. విచారణలో మంగళగిరిలోని ఓ డేటా సెంటర్ సర్వర్ నుంచి ఈ కాల్స్ వస్తున్నట్లు నిర్ధారించారు. ఈ కంపెనీ నడుపుతున్న రాహుల్‌కుమార్‌ను సంప్రదించగా తన కంపెనీకి వంద సిప్‌లు గ్రూప్ కాల్స్ మాట్లాడడానికి అనుమతి తీసుకున్నట్లు తెలిపాడు. ఈ సిప్‌లు తీసుకోవడానికి నకిలీ జీఎస్టీ పత్రాలు, పాన్‌కార్డు అతను అందజేసినట్లు విచారణలో తేలింది. వీటిపై క్షేత్ర స్థాయిలో సక్రమంగా విచారించకుండానే జియో సంస్థ సిప్‌లు జారీ చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. జియో సంస్థ స్టేట్ మేనేజర్ రమణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది నవంబర్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్‌ను గోరక్‌పూర్‌లో అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు రాహుల్‌కు రిమాండ్ విధించింది. రాహుల్ కుమార్ మాత్రం తనకు ఇవేమీ తెలియవని, తన కాల్ సెంటర్ ఉద్యోగులే చూసుకుంటారని, తమ కంపెనీ డేటాను ఎవరో దొంగిలించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే యాప్ నుంచి ఏ కంపెనీ డేటా అయిన డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రాక్టికల్‌గా పోలీసులకు చూపించాడు. కంపెనీ రాహుల్ పేరు మీద ఉండడంతో బాధ్యుడిగా చేసి అతనిపై టెలి కమ్యూనికేషన్ యాక్ట్‌తోపాటు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీలో చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
టెలి కమ్యూనికేషన్ యాక్ట్ కింద వ్యక్తి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment