మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి
లక్ష్మీపురం: మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేటలోని మల్లయ్య లింగంభవన్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మిర్చికి కనీసం క్వింటాకు రూ.25 వేలు మద్దతు ధర ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగానే సోమవారం మిర్చి యార్డుకు సందర్శిస్తామని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, పచ్చల శివాజీ, ఆకీటి అరుణ్ కుమార్, షేక్ వలి, బందెల నాసర్ జీ, జిల్లా సమితి సభ్యులు జంగాల చైతన్య పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment