జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల కలకలం
గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్‌లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ శనివారం పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు లిఖిత పూర్వకంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. బ్లడ్‌బ్యాంక్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్‌పై ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతున్న విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో సదరు సంఘటనపై విచారణ చేపట్టారు.
రక్తనిధి కేంద్రంలో రాత్రివేళ ఇలా..
బ్లడ్‌బ్యాంక్‌లో రాత్రి సమయాల్లో అవసరం లేకపోయినా ఓ డాక్టర్ తిష్టవేసి తమతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని కొంత మంది సిబ్బంది ఆరోపిస్తున్నారు. అందుకు బ్లడ్‌బ్యాంక్‌లో చేతులు కోసుకున్న సంఘటన ఉదాహరణగా చెబుతున్నారు. రెండు నెలల క్రితం బ్లడ్ బ్యాంక్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో ఇద్దరు ఓ డాక్టర్ తన వాడంటే, తన వాడంటూ చేతులు కోసుకున్న సంఘటన కలకలం రేకెత్తించింది. దీనిపై విచారించిన అధికారులు సదరు డాక్టర్‌పై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో అతని రాసలీలకు అడ్డు లేదని అంటున్నారు. ఇప్పుడు లైంగిక వేధింపుల సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్లడ్‌బ్యాంక్‌లో మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణ చేయాల్సిన పనులన్నీ ఓ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బంది సదరు ఉద్యోగిపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయాలన్నా, తనకు నచ్చినట్లు ఉంటేనే మంజూరు చేస్తాడన్నారు. లేనిపక్షంలో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
బ్లడ్ బ్యాంక్‌లో అసభ్యకర ప్రవర్తన ఫిర్యాదు చేసిన విద్యార్థినులు
విచారణకు కమిటీ ఏర్పాటు
బ్లడ్‌బ్యాంక్‌లో అసభ్యకర ప్రవర్తన చేస్తున్నారని ల్యాబ్ టెక్నీషియన్‌పై ఐదుగురు విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదుపై తక్షణమే విచారణకు కమిటీని నియమించామన్నారు. సంఘటనపై బ్లడ్‌బ్యాంక్‌లో డాక్టర్‌ను కూడా పిలిపించి విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment