
గుంటూరు
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సంతోషాల రంజాన్
రంజాన్ పర్వదినాన్ని సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మసీదులు, ఈద్గాలు కళకళలాడాయి. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేసవి దృష్ట్యా మసీదులు, ఈద్గాల వద్ద షామియానాలు వేశారు. తాగునీటి సదుపాయం కల్పించారు. భక్తులు ఇబ్బంది పడకుండా పలుచోట్ల కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంలోని పలు మసీదులను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉంటే కొన్నిచోట్ల ముస్లింలు కేంద్ర ప్రభుత్వం చేయనున్న వక్ఫ్ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. నల్లరిబ్బన్లు చేతికి ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. – నగరంపాలెం(గుంటూరు వెస్ట్)
7
వైభవంగా పోలేరు తల్లి తిరునాళ్ల
రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడులో గ్రామ దేవత పోలేరు తల్లి తిరునాళ్లను సోమవారం నిర్వహించారు. గ్రామ స్తులు పొంగళ్లు చేసి నైవేద్యంగా సమర్పించారు. ఏర్పాట్లను ఆల య ధర్మకర్త చాగంటి శ్రీనివాసరెడ్డి, సభ్యులు
పర్యవేక్షించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 519.70 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువకు 4,050 క్యూసెక్కులు విడుదలవుతోంది.
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి సోమవారం చిలకలూరిపేట గణపవరానికి
చెందిన గ్రంథి శ్రీనివాసరావు కుటుంబం
రూ. 1,01,116 విరాళాన్ని అందించింది.
న్యూస్‌రీల్

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు