
తెనాలి లాయర్స్ డైరీ ఆవిష్కరణ
తెనాలి: పట్టణానికి చెందిన న్యాయవాదుల చరిత్రపై రూపొందించిన ‘తెనాలి లాయర్స్ డైరీ’ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ పి.వెంకట జ్యోతిర్మయి గురువారం తన చాంబరులో ఆవిష్కరించారు. తెనాలి న్యాయవాది గుంటూరు కృష్ణ ఈ డైరీని రూపొందించారు. తెనాలి న్యాయవాదులు సమాజానికి చేసిన సేవలను, వృత్తిలో ఎదిగిన విధానాలను డైరీలో భావితరాలకు ఉపయోగపడేలా రూపొందించడం అభినందనీయమని వెంకట జ్యోతిర్మయి అన్నారు. 2011, 2018లో తెనాలి లాయర్స్ డైరీని తీసుకురాగా, మార్పులు చేర్పులతో ప్రస్తుతం ముద్రించినట్లు కృష్ణ చెప్పారు. తెనాలి కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన డాక్టర్ వెంకట జ్యోతిర్మయి చేతుల మీదుగా డైరీని ఆవిష్కరింప చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సహకరించిన పట్టణ ప్రముఖులు, న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి నన్నపనేని శ్రీహరి, హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు గొడవర్తి కిరణ్‌బాబు పాల్గొన్నారు.