వినాయకుడి శోభాయాత్రలో స్టెప్పులేస్తున్న సీపీ రంగనాథ్
వరంగల్ క్రైం : ట్రై సిటీస్ పరిధిలో వినాయక నిమజ్జనానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పరిధి కాలనీల్లో నిమజ్జన ప్రాంతాలను ముందస్తుగా గుర్తించడంతో పాటు ఆయా వినాయక మండపాల నిర్వాహకులకు సూచనలు చేశారు. ఒక్కో వినాయక ప్రతిమ తరలింపునకు ఒక కానిస్టేబుల్‌ను కేటాయించారు. మహానగరంలో బందోబస్తును నలుగురు డీసీపీలు, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 12 మంది ఏసీపీలు పర్యవేక్షించగా.. 36 మంది ఇన్‌స్పెక్టర్లు, 80 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, సుమా రు వేయి మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. విగ్రహా లను నిమ్జజనం చేసే ప్రాంతాలను సీపీ సందర్శించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపు ప్రక్రియను చేపట్టారు.
స్టెప్పులేసిన సీపీ
కమిషనరేట్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి సీపీ రంగనాథ్ స్టెప్పులేశారు. సిబ్బందితో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment