
మంత్రికి ఆహ్వానం
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖను రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ బుధవారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖకు ఈ నెల 26వ తేదీన జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఉపేంద్రశర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, జాగరణలో ఉన్న భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా మంత్రి స్పందిస్తూ తగిన ఏర్పాట్లు చేయిస్తానని హామీ ఇచ్చారు.
రూ.50వేల ఆర్థికసాయం
వరంగల్ చౌరస్తా : నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వేముల సంతోష్ ఇటీవల మృతిచెందారు. కాగా బుధవారం వరంగల్ ఆర్‌ఎన్‌టీ రోడ్డులోని పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో కుటుంబ భద్రత పథకం ద్వారా సంఘం అధ్యక్షుడు, మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు రూ.50వేల నగదును సంతోష్ భార్య ప్రవీణకు అందజేశారు.
చేయూత
హసన్‌పర్తి : ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ విద్యార్థి కుటుంబానికి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు చేయూతనిచ్చారు. 65వ డివిజన్ చింతగట్టు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువున్న షేక్ జహిరాబీ తల్లి, సోదరీ ఇటీవల కమలాపూర్ మండలం గూడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్నారు. దీంతో జహిరాబీ వారి బాగోగులు చూస్తూ పాఠశాలకు దూరమైంది. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు పద్మ, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు బాధిత కుటుంబీలకు రూ.5,555ల నగదు అందజేసి మానవత్వం చాటుకున్నారు.
చదువుపై దృష్టిసారించాలి
కాజీపేట : విద్యార్థులు తమ విలువైన సమయాన్ని సెల్‌ఫోన్లతో గడపకుండా చదువుపై దృష్టి సారించాలని సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్ సూచించారు. కాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం సంస్కార వికాస శిక్షణ సదస్సును నిర్వహించగా ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్, కొండబత్తిన రాజేందర్, మార్క రవీందర్, గంగారపు యాదగిరి, మూల ఐలయ్య, సునీత, విద్యావతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్ విడుదల చేయాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పలు సమస్యలను పరిష్కరించాలని, పార్ట్‌టైం లెక్చరర్ల నియమకానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు బుధవారం వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్‌డీఎల్‌సీఈలో కౌన్సిలర్లను నియమించాలన్నారు. ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని ఓఎస్‌డీ పదవినుంచి తొలగించాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కె.సుమన్, కేయూ ఇన్‌చార్జ్ జెట్టి రాజేందర్, జిల్లా కోఆర్డినేటర్ అరూరి రంజిత్, ఎంఎస్‌ఎఫ్ కేయూ ఇన్‌చార్జ్ డాక్టర్ వడ్డెపల్లి మధు, కేయూ డాక్టరేట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మద్దిరాల మోహన్‌రెడ్డి, కుర్సా బాధ్యులు సోమరాజు, విష్ణు, పరిశోధక విద్యార్ధులు కేతపాక ప్రసాద్, కందికొండ తిరుపతి పాల్గొన్నారు.

మంత్రికి ఆహ్వానం

మంత్రికి ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment