ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
● హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్
దాసరి ఉమామహేశ్వరి
మడికొండ: తెలంగాణ రాష్ట్ర గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లు హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్, మడికొండ బాలికల పాఠశాల ప్రిన్సి పాల్ దాసరి ఉమామహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. హాల్ టికెట్లు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో మొత్తం 16 సెంటర్లు కేటాయించినట్లు తెలిపారు. 16 సెంటర్లలో 5వ తరగతిలో 2,548, 6లో 895, 7లో 451, 8లో 329, 9వ తరగతిలో 286 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నట్లు చెప్పారు. మొత్తం 4,509 మంది హనుమకొండ జిల్లాలో పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందు చూసుకోవాలని సూచించారు. పరీక్ష రోజు కేంద్రం వద్దకు ఉదయం 9.30 గంటలకు చేరుకోవాలన్నారు. పరీక్ష ప్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్, ఆధార్ కార్డు, హాల్ టికెట్ తప్పకుండా తీసుకుని రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment