వరంగల్: ప్రభుత్వ భూముల్లో చేసిన ప్లాట్లను విక్రయిస్తూ.. అక్రమంగా వసూళ్లకు పాల్ప డుతూ.. ఇవ్వని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు వరంగల్ కాశిబు గ్గ వివేకానంద కాలనీకి చెందిన దుబ్బ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంతేజార్‌గంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ షుకుర్ మాట్లాడుతూ.. దేశాయిపేట శివారు ఎంహెచ్‌నగర్‌లోని ప్రభుత్వ భూముల్లో సీపీఎం పేరుతో గుడిసెలు వేసి వాటిని ఆధీనంలోకి తీసుకుని అమాయకులైన నిరుపేదలకు వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించి వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు, ఒకటే ప్లాట్‌ని ఇద్దరు, ముగ్గురికి అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. అడ్వాన్సులు ఇచ్చి ప్లాట్లు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయాలని అడిగితే అదనంగా డబ్బులిస్తేనే ఆప్లాట్‌ను అప్పగిస్తానని మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. డబ్బులు తీసుకున్న విషయం ఎవరికై నా చెబితే వారిని చంపుతానంటూ బెదిరిస్తున్నాడని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. గురువారం (20వ తేదీ)న బాధితులు నగరానికి చెందిన శిరీష, రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు షుకుర్ తెలిపారు. కాగా.. విచారణ అనంతరం దుబ్బ శ్రీనివాస్ తనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నాయని వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చేరినట్లు తెలిసింది. ఈవిషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment