టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి
విద్యారణ్యపురి: టీచర్ల, అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి కోరారు. శుక్రవారం వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతోపాటు పలుచోట్ల ఆయన ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓటు వేయాలని అధ్యాపకులను అభ్యర్థించారు. కాగా.. పింగిళి శ్రీపాల్‌రెడ్డిని గెలిపించాలని పీఆర్టీయూ బాధ్యులు డాక్టర్ కుండూరు సుధాకర్, విజయ్‌పాల్‌రెడ్డి, కమీరుద్దీన్, రఘవేందర్, డాక్టర్ రాజేందర్ శుక్రవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, వరంగల్‌ఎల్‌బీ కళాశాలలో ప్రచారం నిర్వహించారు. ప్రచా రంలో పీఆర్టీయూ జిల్లా బాధ్యులు మంద తిరుపతిరెడ్డి, భానుప్రసాద్‌రెడ్డి, కె.రజిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment