రైతులకు రుణాలు అందించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: జిల్లాలోని ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూములకు పంట రుణాలు ఇవ్వాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కలిగిన రైతులు రుణాల మంజూరులో ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. బ్యాంకు అధికారుల నిబంధనలను పరిగణనలోకి తీసుకుని వారికి నివేదికలను సమర్పించాలని డీటీడీఓకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి రుణాలు అందించేందుకు ప్రణాళికలు తయారుచేసి బ్యాంకర్లకు పంపించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీటీడబ్ల్యూఓ సౌజన్య, లీడ్ బ్యాంకు అధికారి రాజు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment