
పరిశోధనలకు పేటెంట్
అభినందించిన కేయూ వీసీ, రిజిస్ట్రార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి పర్యవేక్షణలో ఇద్దరు విద్యార్థులు పూర్తిచేసిన పీహెచ్‌డీ పరిశోధనలకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించింది. ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన రసాయనాల బయాలాజికల్ యాక్టివిటీపై డాక్టర్ లూనావత్ వెంకన్న చేసిన పరిశోధనలపై పేటెంట్ కోసం 2023 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వానికి దరఖాస్తుచేసుకోగా ఈనెల 20న సంబంధిత కార్యాలయం నుంచి మంజూరు వచ్చినట్లు ప్రొఫెసర్ ఇస్తారి శనివారం వెల్లడించారు. అలాగే కిలోట్రోపిస్ ప్రొసీరా(శ్వేతార్క) మొక్క వేర్ల నుంచి రసాయనాన్ని మాడిఫై చేసి బయాలజికల్ యాక్టివిటీని పెంచే అంశంపై జువాలజీ విభాగం పరిశోధకురాలు బూర్గుల కవిత చేపట్టిన పరిశోధనకు సైతం పేటెంట్ లభించిందని పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించి పూర్తి సమాచారంతో 2024లో భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయానికి దరఖాస్తు చేయగా.. ఈనెల 21న పేటెంట్ లభించిందని వివరించారు. ఈ సందర్భంగా పేటెంట్ గ్రహీతలతోపాటు ప్రొఫెసర్ మామిడాల ఇస్తారిని శనివారం పరిపాలనా భవనంలో వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment