డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
మామునూరు: విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు పెంపొందించుకోవాలని వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు సూచించారు. శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైకియాట్రిస్ట్ భరత్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన నిర్వహించారు. సాంబశివరావు మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం డాక్టర్ అఖిల సీపీఆర్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. సైకియాట్రిస్ట్ భరత్‌కుమార్, యూనిట్ ఆస్పత్రి వైద్యాధికారిని డాక్టర్ అన్వేషి పదో తరగతి పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. సమావేశంలో హెచ్‌ఎంలు గోవిందరావు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, కళ్యాణి, రవీందర్, సంపత్, సత్యనా రాయణరెడ్డి, సుజాత, అనిత, లత, రవికుమార్, పెద్దిరాజు, విద్యార్థులున్నారు.
హాస్టళ్లకు జాయింట్
డైరెక్టర్ల నియామకం
కేయూ క్యాంపస్: కాకతీయ యూని వర్సిటీలో హాస్టళ్లకు, మెస్‌లకు కలిపి నూతన జాయింట్ డైరెక్టర్లను 23 మందిని నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ డైరెక్టర్లుగా 17 మంది కాంట్రాక్టు లెక్చరర్లను, మరో ఆరుగురు పార్ట్‌టైం లెక్చరర్లను కలిపి 23 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జా రీ చేశారు. ఆయా ఉత్తర్వులను జా యింట్ డైరెక్టర్లకు వీసీ ఆచార్య ప్ర తాప్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో కేయూ దూర విద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య బి.సురేశ్‌లాల్, హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఎల్‌పి రాజ్‌కుమార్, అదనపు సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎ.నరేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment