
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
హన్మకొండ: పాత పెన్షన్ విధానం అమలు చేయాలి.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే.అరుణ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ దీన్‌దయాళ్‌నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత పెన్షన్ విధానానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ ఒక్క పట్టభద్రుల స్థానానికి మాత్రమే పోటీ చేస్తున్నదని, మూడు స్థానాల్లో బరిలో నిలుస్తున్న బీజేపీ అన్నీ గెలుస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి గెలుపు ఖాయమని, ఆయన విద్యారంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై శాసన మండలిలో గళం వినిపించడానికి బీజేపీ పోటీ చేస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయినందునే పోటీ చేయడం లేదని విమర్శించారు. నారాయణపేటలో సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. రేవంత్ పాలనకు.. మోదీ పాలనకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మీ పాలనపై నమ్మకం ఉంటే.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలు నిర్వహించి ప్రజల్లో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, కార్పొరేటర్ చాడా స్వాతి, నాయకులు డాక్టర్ పెసరు విజయ్‌చందర్ రెడ్డి, రమేష్, చంద్రశేఖర్, మధు, రాఘవ రెడ్డి, సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని
సీఎం రేవంత్ సర్కారు
నిలుపుకోవాలి
పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే.అరుణ
Comments
Please login to add a commentAdd a comment