కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల మొదటి సంవత్సరం మొద టి సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసిం ఇక్బాల్ గురువారం తెలిపారు. ఈనెల 21, 2 4, 28, మార్చి 3, 5వ తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతా యని తెలిపారు. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల లా కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈనెల 22, 25, మా ర్చి 1,4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఐదేళ్ల లా కోర్సు 5వ సెమిస్టర్ పరీక్షలు
ఐదేళ్ల లా కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 21, 24, 28, మార్చి3, 5తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
ఐదేళ్ల లా కోర్సు తొమ్మిదో సెమిస్టర్ పరీక్షలు
ఐదేళ్ల లా కోర్సు తొమ్మిదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 22, 25, మార్చి 1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్ తదితర పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి. సురేశ్‌లాల్ సందర్శంచి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వీరి వెంట ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లారమేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment