యూత్ ఫెస్టివల్‌తో నాయకత్వ లక్షణాలు
● ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్
హసన్‌పర్తి: యూత్ ఫెస్టివల్‌తో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్ అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం యూత్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ దీపక్ గార్గ్ మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి ఈ వేదిక ఉపయోగపడుతోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాల్లో తమ ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, డాక్టర్ వి.మహేశ్, డాక్టర్ వి.వి.వి.సుధాకర్, ఎన్‌ఎస్‌ఎస్ కోర్డినేటర్ డాక్టర్ కె. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలతోనే గుర్తింపు
ఖమ్మంవైద్యవిభాగం: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోనే ఆస్పత్రులకు గుర్తింపు లభిస్తుందని పలువురు వైద్యులు పేర్కొన్నారు. గురువారం ఖమ్మం నెహ్రూనగర్‌లోని ‘అఖిల’ కంటి ఆస్పత్రి ఏడో వార్షికోత్సవం నిర్వహించగా డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఓపీ చాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అఖిల మాట్లాడుతూ నెలలు నిండకుండా జన్మించిన చిన్నారుల్లో రెటీనా సంబంధిత సమస్యలు ఎదురైతే వైద్యం అందించడం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ మాధవి, మేనేజింగ్ డైరెక్టర్ కుతుంబాక మధు, డాక్టర్ సమత, శ్రీధర్, సతీశ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల పునర్నియామకం
హన్మకొండ: వివిధ కారణాలతో తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియ న్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నలు గురు డ్రైవర్లు, నలుగురు కండక్టర్లను పునర్నియామకం చేస్తూ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం విజయభాను మాట్లాడుతూ ఉద్యోగులు అంకితభావం, నిబద్దత, నిజాయితీతో విధులు నిర్వర్తించాలన్నారు. కుటుంబ సభ్యులు విధులకు వచ్చే వారిని మానసిక ప్రశాంతతో పంపించా లన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. డిప్యూటీ ఆర్‌ఎంలు కేశరాజు భా నుకిరణ్, మాధ వరావు, పర్సనల్ ఆఫీసర్ ఆర్పిత పాల్గొన్నారు.
యూత్ ఫెస్టివల్‌తో నాయకత్వ లక్షణాలు
యూత్ ఫెస్టివల్‌తో నాయకత్వ లక్షణాలు
యూత్ ఫెస్టివల్‌తో నాయకత్వ లక్షణాలు
Comments
Please login to add a commentAdd a comment