
అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
హన్మకొండ చౌరస్తా: అభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం నడుస్తోందని, అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. హనుమకొండ 5వ డివిజన్ పరిధిలోని కొత్తూరు బ్రిడ్జి వద్ద రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా అన్ని డివిజన్లలో సైడ్ డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో అర్హులందరికీ రేషన్‌కార్డులు, డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోందన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి