
రక్తనిధి.. హతవిధీ!
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారు అనేకం. రోగులకు వైద్య సేవలందించడంలో రక్తనిధి పాత్ర కీలకం. అలాంటి బ్లడ్ బ్యాంక్ నిర్వహణను నిర్వాహకులు, ఎంజీఎం పరిపాలనాధికారులు గాలికి వదిలేశారు. పేదలకు రక్తం అందించేందుకు వచ్చిన దాతలకు కనీస సౌకర్యాలు అందడం లేదు. రక్త నిధి కేంద్రాన్ని పర్యవేక్షించే అధికారులు వివిధ పనులంటూ ఎప్పుడు.. ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రక్త నిధి కేంద్రంలో ఎన్ని నిల్వలున్నాయి? రిజర్వ్ చేసిన బ్లడ్ ఎంత? సమాచారం తెలుసుకునేందుకు బ్లడ్ బ్యాంక్ నంబర్ సైతం కొన్నేళ్ల నుంచి పనిచేయడం లేదు. ఈక్రమంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఏకంగా 55సార్లు రక్తదానం చేసిన వ్యక్తి ఎంజీఎం రక్త నిధి కేంద్రానికి సౌకర్యాలు కల్పించాలంటూ సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రక్త నిధికేంద్ర నిర్వహణ పనితీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
పని చేయని ఫోన్ నంబర్
ఎంజీఎం ఆస్పత్రిలో రక్త నిల్వల కోసం ప్రభుత్వం ఎంజీఎం సూపరిండెంట్ కోసం అధికారికంగా ఎలాగైతే నంబర్ కేటాయించారో.. సేవల్లో కీలకంగా ఉండే రక్త నిధి కేంద్రానికి సైతం 94906 1947 అనే నంబర్‌ను కేటాయించారు. ఈనంబర్‌ను ఉపయోగిస్తే విధులను కచ్చితంగా నిర్వర్తించాల్సి వస్తుందని తెలిసి కొన్నేళ్లుగా ఈ నంబర్‌ను వాడకుండా వదిలివేసినట్లు తెలుస్తోంది.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం..
నేను ఇప్పటి వరకు 55 సార్లు రక్తదానం చేశా. 2017లో అప్పటి ఆర్‌ఎంఓకు బెడ్స్ గురించి తెలుపగా నామమాత్రంగా మరమ్మతులు చేశారు. ప్రస్తుతం రక్త నిధి కేంద్రానికి దాతలను తీసుకొస్తే చిరిగిపోయిన బెడ్స్ ఉన్నాయని, నిర్వహణ సరిగ్గా లేదని రక్తం ఇచ్చేందుకు వెనుకడుడు వేస్తున్నారు. ఎంజీఎం అఽధికారులకు తెలిపినా స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేశాం.
– అయిత ఉషాభాస్కర్
రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చేవారికి అండగా నిలవాలి. కానీ వారికి కనీస అవసరాలను కూడా అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీనం రక్తం సేకరించే క్రమంలో దాతలు పడుకునే బెడ్స్‌ను సైతం సమకూర్చలేని దుస్థితి ఎంజీఎంలో నెలకొంది. కాగా.. సమస్యలపై ఆస్పత్రి నిర్వాహకులు, అధికారులను ప్రశ్నిస్తే అన్నింటికీ వారు ఒకే సమాధానం చెబుతున్నారు. ‘వ్యవస్థను ఒక్క రోజులో గాడిన పెట్టలేం’ అంటూ దాటవేస్తున్నారు. జేబులు నింపుకునే ఫైళ్లపై చూపిస్తున్న ఆసక్తి సేవల మెరుగుదలకు చూపించడం లేదని కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.
చిరిగిన బెడ్
నిండుకుంటున్న నిల్వలు..
ఎంజీఎం ఆస్పత్రికి ప్రతీరోజు ప్రాణాపాయ స్థితిలో 10 నుంచి 20 మంది క్షతగాత్రులు వస్తుంటారు. వీరికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కిస్తూ చికిత్సలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి రక్త నిధి కేంద్రంలో రోగులు ఎప్పుడు రక్తం కావాలని అడిగినా నిల్వలు నిండుకున్నాయని చెప్పడం పరిపాటిగా మారింది. అసలు ఎంజీఎం ఆస్పత్రిలో రక్తనిధి కేంద్ర సిబ్బంది పనితీరుపై దృష్టి సారించకపోవడంతోనే ఈ కేంద్రం అధ్వానంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంజీఎం రక్తనిధి కేంద్రంలో నిండుకున్న నిల్వలు
చిరిగిన బెడ్స్.. కనీస వసతులు కరువు
కీలక విభాగాన్ని పట్టించుకోని
అధికారులు
పనిచేయని బ్లడ్‌బ్యాంక్ ఫోన్ నంబర్
సేవలు మెరుగుపర్చాలని గ్రీవెన్స్‌లో
కలెక్టర్‌కు ఫిర్యాదు

రక్తనిధి.. హతవిధీ!

రక్తనిధి.. హతవిధీ!

రక్తనిధి.. హతవిధీ!

రక్తనిధి.. హతవిధీ!