
పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి
వరంగల్: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో టీజీఐపాస్ కింద వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,365 యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు చేయగా.. 1,076 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. 180 ప్రతిపాదనలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించామని, పూర్తి సమాచారంతో తిరిగి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం రమేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్ బాబు, అధికారులు పాల్గొన్నారు.
15 వరకు ఇంటర్న్‌షిప్
రెండో దశ దరఖాస్తుకు గడువు
భారత ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం రెండో దశ దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇప్పటికే దాదాపు మూడు లక్షల పైగా దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 11 6090ను సంప్రదించాలని ఆమె కోరారు.
సహకార శాఖ అభివృద్ధిపై సమావేశం..
జిల్లా సహకార శాఖ అభివృద్ధి, జన ఔషధిపై కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డీసీఓ నీరజ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, మత్స్యశాఖ అధికారి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
పోషణ పక్షం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ..
కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం పోషణ పక్షం వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ సత్యశారద, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ్ అభియాన్‌లో భాగంగా ఈనెల 8 నుంచి 22 వరకు పోషణ పక్షం నిర్వహించనున్నట్లు తెలిపారు.