
ఆర్టీసీ బస్సు బోల్తా..
హసన్‌పర్తి: హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై చింతగట్టు క్యాంప్ ఓఆర్‌ఆర్ వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీ సుల కథనం ప్రకారం..ఆదిలాబాద్ డిపోనకు చెందిన లహరి ఏసీ డీలక్స్ ఆర్టీసీ బస్సు సోమవారం సాయంత్రం ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు బయల్దేరి, హనుమకొండ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. ప్ర యాణికులు ఎక్కిన అనంతరం మంగళవారం తెల్ల వారు జామున 3:15గంటల ఆదిలాబాద్‌కు బయల్దేరింది. 3.30గంటలకు చింతగట్టు క్యాంప్ సమీపంలోకి రాగానే, అదే సమయంలో మోటార్ గ్రేడర్ వాహనం అజాగ్రత్తగా రోడ్డుపై రివర్స్‌గా వచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ఒక్కసారి భారీ శబ్దం రావడంతో బస్సునుంచి మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై అరుపులు చేయగా, వాహనదారులు, స్థానికులు అక్కడికి చేరుకుని వారిని బయటికి తీశారు.
ఏడుగురికి గాయాలు
ఈ ప్రమాదంలో బస్సు, డ్రైవర్ వైపు బోల్తా పడింది. దీంతో నిద్ర మత్తులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. బస్సు డ్రైవర్ మారపల్లి సుభాష్‌చంద్రతో పాటు బత్తుల వెంకటేశ్, గంప శ్రీకాంత్, ఎండీ జాకీర్ హుస్సేన్, కోటేశ్వర్ రావు, ఎస్‌కే మోజీ, కళ్లెం రత్నంరాజు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఘటన స్థలాన్ని చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నిలిచిపోవడంతో సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనకు కారకుడైన మోటార్ గ్రేడర్ డ్రైవర్ వినోద్‌సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
డ్రైవర్‌తో పాటు ఆరుగురికి గాయాలు
తెల్లవారు జామున ఘటన