
ఉద్విగ్న క్షణాలు..
యువ వైద్యులు సేవాభావంతో
ముందుకు సాగాలి
ఎంజీఎం : ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువ వైద్యులు వృత్తిని సేవాభావంతో కొనసాగిస్తూ పేదలకు బాసటగా నిలవాలని కాళోజీ హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ నందకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కాకతీయ మెడికల్ కళాశాల 61 గ్రాడ్యుయేషన్ డే కనుల పండువగా నిర్వహించారు. విద్యార్థుల పట్టాల ప్రదానోత్సవానికి తల్లిదండ్రులతోపాటుబంధుమిత్రులు పెద్ద ఎత్తున రావడంతో కళాశాల ప్రాంగణమంతా పండుగ వాతావ రణం నెలకొంది. వైద్యవిద్యలో ఓ ఘట్టం పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ బంధుమిత్రులతో సెల్పీలు దిగుతూ సందడి చేశారు. 2019లో ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందిన 230 మంది విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు పొందారు.
సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెట్టాలి..
వైద్యవిద్యలో ఎంబీబీఎస్ మొదటి ఘట్టం మాత్రమేనని, వైద్యులు నిరంతర విద్యార్థులని వీసీ పేర్కొన్నారు. ఎంబీబీఎస్ అనంతరం తమ లక్ష్యాల మేరకు పోస్టు గ్రాడ్యుయేషన్ సాధించి ఉన్నత వైద్యులుగా ఎదగాలని ఆశించారు. ప్రస్తుతం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పరుగులు పెడుతూ వైద్యవిద్యనభ్యసించాలని వర్సిటీ రిజిస్ట్రార్ సంధ్యాఅనిల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్‌రెడ్డి, రాజేశ్వరి, విజయలక్ష్మి, మధుసూదన్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ నందకుమార్‌రెడ్డి
కేఎంసీలో విద్యార్థులకు పట్టాల ప్రదానోత్సవం

ఉద్విగ్న క్షణాలు..

ఉద్విగ్న క్షణాలు..

ఉద్విగ్న క్షణాలు..

ఉద్విగ్న క్షణాలు..

ఉద్విగ్న క్షణాలు..

ఉద్విగ్న క్షణాలు..

ఉద్విగ్న క్షణాలు..

ఉద్విగ్న క్షణాలు..

ఉద్విగ్న క్షణాలు..