
ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్‌కు స్థల పరిశీలన
కాజీపేట అర్బన్ : పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి బుధవారం హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కాజీపేట తహసీల్దార్ భావ్‌సింగ్ స్థలాన్ని పరిశీలించారు. కాజీపేట మండలం న్యూశాయంపేట పరిధి 23, 135, 389, 399, 579 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని సందర్శించిన వారు.. స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాలు అవసరం ఉండగా.. తగిన స్థలం దొరకలేదని తెలిపారు.
ఎన్‌సీసీని పటిష్టం చేస్తాం..
కేయూ క్యాంపస్: ఎన్‌సీసీ విభాగాన్ని రాబో యో రోజుల్లో మరింత పటిష్టం చేస్తామని ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ నింబాల్కర్ అన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ కార్యక్రమాల గురించి ఆ కళాశా ల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి వివరించా రు. ఎన్‌సీసీ కార్యక్రమాలకు తమ వంతుగా సహకారమందిస్తామని నింబాల్కర్ తెలిపారు. ఈసందర్భంగా నింబాల్కర్‌ను ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌సీసీ ఆఫీసర్ డాక్టర్ స్వామిచాడ అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ కుటుంబానికి
భద్రత చెక్కు అందజేత
వరంగల్ క్రైం : కమిషనరేట్ పరిధి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబర్ 13న మరణించి న సదానందం కుటుంబానికి పోలీస్ భద్రత విభాగం రూ.7,89,920 చెక్కు మంజూరు చేసింది. బుధవారం కుటుంబ సభ్యులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్ అందజేశారు. మరణించిన హెడ్‌కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ప్రస్తుత స్థితిగతులపై ఆయ న ఆరా తీశారు. ఏఓ రామకృష్ణ, సూపరింటెండెంట్ రమాదేవి పాల్గొన్నారు.
జెడ్పీ వాహనాలకు వేలం
హన్మకొండ: హనుమకొండ జిల్లా ప్రజాపరిష త్ ఆవరణలో తుప్పు పట్టిన వాహనాలకు ఎట్టకేలకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో 63 మంది పాల్గొనగా.. రూ.4,01,500 విలువైన 10 వాహనాలను నలుగురు దక్కించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, డిప్యూటీ సీఈఓ రవి, డీటీఓ వేణుగోపాల్, ఆత్మరాం పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్‌కు స్థల పరిశీలన

ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్‌కు స్థల పరిశీలన