
అదుపు తప్పిన బైక్..
చిట్యాల: బైక్ అదుపు తప్పి ఓ కారోబార్ మృతి చెందాడు. ఈ ఘటనలో మంగళవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నవాబుపేటకు చెందిన జిల్లెల కుమార్(40) కై లాపూర్ కారోబార్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శాంతినగర్‌లో ఉపాధిహామీ పనులు జరుగుతున్న క్రమంలో అక్కడికి వెళ్లి కూలీల వివరాలు తీసుకుని ఎంపీడీఓ కార్యాలయంలో అందజేశాడు. అనంతరం నవాబుపేటకు వెళ్తున్న క్రమంలో మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాం మలుపు సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున అటువైపు వెళ్తున్న స్థానికుడు బుర్ర రఘు గౌడ్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై శ్రవణ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కృప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, కై లాపూర్ పంచాయితీ కార్యదర్శి అజీరాబేగం.. మృతుడి భార్యకు అంత్యక్రియల నిమిత్తం రూ. 10వేల ఆర్థిక సాయం అందించారు.
● కారోబార్ మృతి
● చిట్యాలలో ఘటన