
అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని డాక్టర్ బా బా సాహెబ్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్‌గా హిస్టరీ అండ్ టూ రిజం మేనేజ్‌మెంట్ విభాగాధిపతి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్.రాజ్‌కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్‌కుమార్ కామన్ మెస్ సంయుక్త సంచాలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పీఏసీఎస్‌లను
బలోపేతం చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) బలోపేతానికి, నూతన సహకార సంఘాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతం, నూతన సంఘాల ఏర్పాటుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కొత్తగా ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనల గురించి జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి అదనపు కలెక్టర్‌కు వివరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సోలార్ పవర్‌ప్లాంట్, పెట్రోల్ బంకులు, సీఎస్‌సీ సెంటర్లు, జనరిక్ ఔషధ కేంద్రాల ఏర్పాటు గురించి సంజీవరెడ్డి వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో
పనిచేయని లిఫ్ట్
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లో పై అంతస్తులకు వెళ్లడానికి అధికారులు రెండు లిఫ్టులు అమర్చారు. అందులో ఒకటి కొద్ది రోజుల నుంచి పని చేయడం లేదు. ఇది కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉంటుంది. దీని వద్ద ‘లిఫ్టు పనిచేయడం లేదు’ అని అధికారులు బోర్డు అమర్చారు. కాగా.. లిఫ్టు పనిచేస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందనే కారణంతో ఇలా చేస్తున్నారనే ఆరో పణలు కూడా వస్తున్నాయి. ఈవిషయంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పై అంతస్తులో ఉండే ఉద్యోగులు కోరుతున్నారు.
సీపీని కలిసిన అటవీ,
ఎకై ్సజ్ అధికారులు
వరంగల్ క్రైం: వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారి అనోజ్ అగర్వాల్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ అంశాలపై చర్చించారు.

అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్

అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్

అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్