
సక్రమంగా పనులు పూర్తి చేయండి
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో కొనసాగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు సక్రమంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజన్ డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేసర్ వాణి అన్నారు. శుక్రవారం స్థానిక అధికారులతో కలిసి జంక్షన్‌లో కలియ తిరిగి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనుల్లో లోపాలు గుర్తించి సక్రమంగా చేయాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కాజీపేట జంక్షన్‌లో జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీం అభివృద్ధి ఆధునికీకరణ పనులు శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేసర్ వాణి తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు స్థానిక అధికారులతో కలిసి కలియదిరిగి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జనరల్ వెయింటింగ్ హాల్, బేబీ ఫీడింగ్ గది, టాయిలెట్స్ పనులు పరిశీలించి తనిఖీ పలు చోట్ల సలహాలిచ్చారు. అనంతరం రైల్వే స్టేషన్ బయట అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈతనిఖీలో కాజీపేట రైల్వే ఏడీఈఎన్ రామకృష్ణంరాజు, ఐఓడబ్ల్యూ విజయ్‌కుమార్, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
రైల్వే డీఈఎన్ సెంట్రల్ అధికారి
ప్రంజల్ కేసర్‌వాణి
అమృత్ భారత్ పనుల తనిఖీ