సైక్లింగ్‌ రోడ్‌ పోటీలకు కేయూ జట్టు | - | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌ రోడ్‌ పోటీలకు కేయూ జట్టు

Apr 12 2025 2:05 AM | Updated on Apr 12 2025 2:05 AM

సైక్ల

సైక్లింగ్‌ రోడ్‌ పోటీలకు కేయూ జట్టు

కేయూ క్యాంపస్‌: బికనీర్‌లోని మహారా గంగాసింగ్‌ యూనివర్సిటీలో ఈనెల 10 నుంచి నిర్వహించే ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ సైక్లింగ్‌ రోడ్‌(పురుషుల) పోటీలకు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య శుక్రవారం తెలిపారు. జట్టులో ఎన్‌.రాకేష్‌(శ్రీఅరుణోదయం డిగ్రీ కాలేజీ హనుమకొండ), ఎండీ.రియాజ్‌(మాస్టర్జీ డిగ్రీ కాలేటీ హనుమకొండ), జె.సంజీవ్‌, జి.లోకేష్‌(వరంగల్‌ కిట్స్‌), ఎన్‌.మహేందర్‌యాదవ్‌(యూసీపీఈ కేయూ), కె.బాలమురుగన్‌ (ఎల్‌బీ కాలేజీ వరంగల్‌) ఉన్నారు. వీరికి హనుమకొండలోని జాగృతి డిగ్రీ కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎ.రాజేష్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు.

సెలవు రోజుల్లో

ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ

హన్మకొండ: పర్యాటక ప్రాంతాల సందర్శనకు సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ డిప్యూటీ మేనేజర్‌(మార్కెటింగ్‌) టి.శ్రీనివాస్‌ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం, అంబేడ్కర్‌ జయంతి రోజు సోమవారం వరంగల్‌, రామప్ప, లక్నవరం ప్రాంతాల పర్యటనకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.980, పిల్లలకు రూ.790గా నిర్ణయించినట్లు వివరించారు. భోజన చార్జీలు రూ.150, బోటింగ్‌ చార్జీలు రూ.50 అదనం అని తెలిపారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

అందుబాటులోకి

టీజీ ఎన్పీడీసీఎల్‌ యాప్‌

హన్మకొండ: ఐఫోన్‌ వినియోగదారులకు టీజీ ఎన్పీడీసీఎల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ సర్కిల్‌ ఎస్‌ఈ పి.మధుసూదన్‌ రావు, వరంగల్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కె.గౌతం రెడ్డి తెలిపారు. మరిన్ని సాంకేతిక అంశాలు జోడించి టీజీ ఎన్పీడీసీఎల్‌ యాప్‌ను ఆధునీకరించినట్లు వారు వేర్వేరు ప్రకటనలో వెల్లడించారు. ఐఫోన్‌ యాప్‌ స్టోర్‌ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్‌ యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవచ్చన్నారు. ఈ యాప్‌లో 20 ఫీచర్లు ఉన్నాయని వివరించారు. రిపోర్ట్‌ ఆన్‌ ఇన్సిడెంట్‌, కనూ్‌స్య్‌మర్‌ గ్రీవెన్సెస్‌, న్యూ కంప్లైంట్‌, కంప్లైంట్‌ స్టేటస్‌, రీఓపెన్‌, సెల్ఫ్‌ రీడింగ్‌, పే బిల్స్‌, బిల్‌ హిస్టరీ, ఆన్‌ లైన్‌ పేమెంట్‌ హిస్టరీ, కొత్త సర్వీస్‌ స్థితి, లింక్‌ ఆధార్‌ – మొబైల్‌, డొమెస్టిక్‌ బిల్‌ క్యాలిక్కులెటర్‌, కొత్త కనెక్షన్‌ ఎ లా తీసుకోవాలి, పేరు– లోడ్‌ మార్పు, పవర్‌ క ంజమ్సన్‌ గైడ్‌లైన్స్‌, టారిఫ్‌ డీటెయిల్స్‌, ఎనర్జీ సేవింగ్‌ టిప్స్‌, సేఫ్టీ టిప్స్‌, ఫీడ్‌ బ్యాక్‌, మై అ కౌంట్‌, వినియోగదారుల బిల్లు సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరా లు, కాంటాక్ట్‌ ఆజ్‌.. అనే ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.

కాలం చెల్లిన

బేకరీ ఉత్పత్తులు స్వాధీనం

కంపెనీ యజమానిపై కేసు

గీసుకొండ: గ్రేటర్‌ వరంగల్‌ గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని కృప బేకరీ ప్రొడక్ట్స్‌ కంపెనీపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కాలం చెల్లిన బేకరీ పదార్థాలతోపాటు బ్రెడ్‌, బిస్కట్లు, కేకుల్లో వాడేందుకు రూ.32,550 విలువైన 6,510 కుళ్లిన కోడిగుడ్లు, లిక్విడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యజమాని జడ్సన్‌ అబ్రహంను అదుపులోకి తీసుకుని విచారణ కోసం ఫుడ్‌సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.బాబూలాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా బాబూలాల్‌ మాట్లాడుతూ ఆహార పదార్థాల విషయంలో నాణ్యత, పరిశుభ్రత, ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వ్యాపారులపై కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆదేశాల మేరకు ఏసీపీ మధుసూధన్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ కృష్ణమూర్తి, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సైక్లింగ్‌ రోడ్‌ పోటీలకు కేయూ జట్టు1
1/1

సైక్లింగ్‌ రోడ్‌ పోటీలకు కేయూ జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement