వనజీవికి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

వనజీవికి ఘన నివాళి

Apr 13 2025 1:04 AM | Updated on Apr 13 2025 1:04 AM

వనజీవ

వనజీవికి ఘన నివాళి

నిట్‌లో మేడారం జాతరపై జరిగిన జాతీయ ఓరియంటేషన్‌లో రామయ్య దంపతులను సన్మానించిన కార్యక్రమ బాధ్యులు (ఫైల్‌)

ఉమ్మడి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రామయ్య

ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న జిల్లావాసులు

8

లోu

ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

జీవన శైలి వ్యాధుల కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆరోగ్యం కోసం పాతకాలపు రుచులకు జై కొడుతున్నారు. రాగి ముద్ద, కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు, సజ్జలు ఇలాంటి వాటితో చేసే పదార్థాలే కాకుండా.. నువ్వులు, జొన్న కొర్రలతో చేసే చిరుతిళ్లూ తింటున్నారు. నిర్వాహకులు సైతం వీటినే వైరైటీ కాంబినేషన్లతో అందిస్తున్నారు. చిరుధాన్యాలతో చేసే అల్పాహారాన్ని అందించేందుకు చాలా ఫుడ్‌స్టాల్‌లు పుట్టుకొచ్చాయి.

హైదరాబాద్‌ తర్వాత అంతటి రుచికరమైన ఆహారం దొరికేది వరంగల్‌లోనే అని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఏళ్లుగా హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుతున్నారు. ప్రజల్లో పెరిగిన ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ‘మా రెస్టారెంట్‌లో అజినమోటో, ఆర్టిఫీషియల్‌ కలర్స్‌ కలపడం లేదు. నాణ్యమైన వంట సరుకులు వాడుతున్నాం’ అని బోర్డులు పెడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే నగరంలోని రెస్టారెంట్లు.. వారాంతంలో మరింత రద్దీగా కనిపిస్తున్నాయి.

టేస్టీ ఫుడ్‌.. కేరాఫ్‌ గ్రేటర్‌ వరంగల్‌ రెస్టారెంట్లకు బారులుదీరుతున్న జనం

తిన్నంత బిర్యానీ.. వచ్చి తినిపో.. ఇలాంటి కొత్త పేర్లు, వైరెటీ కాన్సెప్టులెన్నో..

మీరేం తినాలో వారే చెప్తారు..

ఏదైనా హోటల్‌కు వెళ్తే మెనూ మీ చేతిలో పెడతారు. కానీ.. ప్రస్తుతం నగరంలో కొత్త తరహా హోటళ్లు ఏర్పాటు చేశారు. మీ డైట్‌కు అనుగుణంగా తయారు చేసిన భోజనమే ఇక్కడ వడ్డిస్తారు. ఊబకాయం, బీపీ, షుగర్‌ వంటి వ్యాధులున్నవారు. కసరత్తులు చేసే వారు తినదగిన పదార్థాలను వడ్డిస్తారు. కొన్ని హోటళ్లలో సేంద్రియ పద్ధతిలో పండించిన వాటితోనే పదార్థాలు తయారు చేసి వడ్డిస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది.

పిల్లలతో కలిసి సరదాగా..

పిల్లలకు సెలవులు వస్తే కుటుంబ సమేతంగా సరదాగా బయటకు వెళ్తాం. షాపింగ్‌ చేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లి చికెన్‌ బిర్యానీ తింటాం. పిల్లల ఆనందం కోసం బయట భోజనం చేస్తుంటాం. పిల్లలతో కలిసి భోజనం చేస్తూ సంతోషంగా గడుపుతుంటాం. కె.మాధురిరెడ్డి, రంగశాయిపేట, వరంగల్‌

ఆకర్షిస్తున్న అన్‌ లిమిటెడ్‌ ఫుడ్‌..

ఒకప్పటిలా తిన్నామా.. బిల్లు కట్టామా.. వచ్చేశామా.. అన్నట్లు కాకుండా కొత్త కాన్సెప్టులతో కస్టమర్లను మెప్పిస్తున్నారు కొందరు రెస్టారెంట్ల నిర్వాహకులు. అన్‌ లిమిటెడ్‌ ఫుడ్‌ అంటూ ఓ ధర నిర్ణయించి నాన్‌ వెజ్‌, వెజ్‌ ఐటమ్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఈహోటళ్లలో ఎంత పడితే అంత తినొచ్చు.

ఒక్క క్లిక్‌తో ఇంటికే..

ఒక్క క్లిక్‌తో వేళాపాళా లేకుండా ఇంటికే భోజనం వచ్చేస్తుంది. అది కూడా నిమిషాల్లో. కొన్ని యాప్‌లు అయితే ఉచిత డెలివరీ ఆప్షన్లు ఇస్తున్నాయి. మరికొన్ని యాప్‌లకు నెలవారీగా, మూడు నెలలకు, ఏడాదికి సబ్‌స్క్రిప్షన్‌ చెల్లిస్తే చాలు పూర్తి స్థాయి ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తావా.. బుక్‌ చెయ్‌. మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్‌ ఇలా.. నోటిఫికేషన్లనూ పంపిస్తూ ఇంటి వద్దకే సేవలందిస్తున్నాయి.

రుచి, నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నాం..

హోటల్‌కు వచ్చే ప్రతీ భోజన ప్రియులకు రుచికరమైన శాఖాహారం, మాంసాహారం భోజనం, బిర్యానీ అందిస్తున్నాం. నాణ్యమైన ఆహారం అందించడం వల్ల హోటల్‌కు కుటుంబ సమేతంగా చేరుకుంటారు. శుచిశుభ్రతను పాటిస్తున్నాం. వారిచ్చే ఆర్డర్‌ ప్రకారం నోరూరించే వంటలు వేడి వేడిగా తయారు చేసి రుచిగా అందిస్తున్నాం. మంచి లాభాలు వస్తున్నాయి.

– సాయి కిరణ్‌, అవంతి గ్రాండ్‌ హోటల్‌, వరంగల్‌

రుచికి ప్రాధాన్యమిస్తున్నాం..

మా సార్‌ ఉద్యోగరీత్యా పని వత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నారు. సండే వస్తే పిల్ల లతో కలిసి బయటకు వెళ్లి సరదాగా రెస్టారెంట్‌లో తింటుంటాం. రుమాలీ రోటీ, పన్నీర్‌ కర్రీతో తింటుంటాం. ప్రస్తుతం రుచికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. – ఇనుగాల శృతి, తిమ్మాపురం

ఆరోగ్యానికి ప్రాధాన్యం

వనజీవికి ఘన నివాళి
1
1/7

వనజీవికి ఘన నివాళి

వనజీవికి ఘన నివాళి
2
2/7

వనజీవికి ఘన నివాళి

వనజీవికి ఘన నివాళి
3
3/7

వనజీవికి ఘన నివాళి

వనజీవికి ఘన నివాళి
4
4/7

వనజీవికి ఘన నివాళి

వనజీవికి ఘన నివాళి
5
5/7

వనజీవికి ఘన నివాళి

వనజీవికి ఘన నివాళి
6
6/7

వనజీవికి ఘన నివాళి

వనజీవికి ఘన నివాళి
7
7/7

వనజీవికి ఘన నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement