మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’ | - | Sakshi

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’

Apr 14 2025 1:13 AM | Updated on Apr 14 2025 1:13 AM

మాకూ

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’

సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

8లోu

సమష్టి అవగాహన,

కఠిన చర్యలు అవసరం

రమ్మీ యాప్‌ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం శ్రీడిజిటల్‌ బాధితుల కమిటీశ్రీ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్‌ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి.

– డాక్టర్‌.బి.కేశవులు, ఎండీ సైకియాట్రిస్ట్‌, సీనియర్‌ మానసిక వైద్య నిపుణులు

నిషేధించిన

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దు

ప్రభుత్వం నిషేధించిన ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటం, వాటిని నిర్వహించడం చట్టరీత్యా నేరం. చర్యలు ఉంటాయి. యువత ఇటీవల ఆన్‌లైన్‌ గేమ్స్‌పై ఆసక్తి చూపుతోంది. ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలాడుతున్నారో గమనించాలి. ఆన్‌లైన్‌ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు.

– కొత్త దేవేందర్‌ రెడ్డి,

ఏసీపీ, హనుమకొండ

విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలను టీఎస్‌యూటీఎఫ్‌ నిర్వహించిందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు బద్దం వెంకటరెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండలోని టీఎస్‌యూటీఎఫ్‌ కార్యాలయంలో సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ యన ఉపాధ్యాయ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీచర్ల సమస్యలపై అనేక ఐక్య ఉద్యమాలను టీఎస్‌యూటీఎఫ్‌ నిర్మించిందని ఆయన గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యుడు డి.కిరణ్‌కుమార్‌, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ిసీహెచ్‌ రవీందర్‌రాజు, పెండెంరాజు, కుమార్‌, సి.సుజన్‌ ప్రసాద్‌రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్‌, జిల్లాల బాధ్యులు లింగారావు, కరుణాకర్‌, కె.మోజెస్‌, సీఎస్‌ఆర్‌ మల్లిక్‌, సదానందం, భాస్కర్‌రా వు, తిరుపతి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

‘నా ఫ్రెండ్‌ రూ.500 పెట్టి రూ.1,500 గెలిచాడు. నేనూ ట్రై చేశా. 5 రోజుల్లో రూ.8,000 పోయాయి. చివరికి సెల్‌ఫోన్‌ అమ్మేశా.’

– ఇంజనీరింగ్‌ విద్యార్థి, వరంగల్‌

‘నాకు డబ్బు రావడం ప్రారంభమైన తర్వాత ఆడి రెఫరల్‌ గ్రూపులు క్రియేట్‌ చేశా. నా అకౌంట్లో డబ్బులు జమవుతాయని మెసేజ్‌ వచ్చింది. ఆఖరికి నా ఖాతా ఫ్రీజ్‌ అయ్యింది.’

– డిగ్రీ విద్యార్థి, నర్సంపేట

– సాక్షిప్రతినిధి, వరంగల్‌

.. ఇలా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రమ్మీ గేమింగ్‌ యాప్‌ల సంస్కృతి పెరుగుతోంది. రమ్మీ యాప్‌లు యువత జీవితాలపై బలమైన దాడి చేస్తున్నాయి. ‘గేమింగ్‌’ ముసుగులో జూ దపు బానిసత్వం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకు ని అప్పులు మూటగట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు.

యాప్‌ల వ్యాప్తి..

ఉమ్మడి వరంగల్‌లో 2022 తర్వాత రమ్మీ యాప్‌ విష సంస్కృతి విచ్చలవిడి అయ్యింది. ప్రధానంగా నగరంలోని వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతోపాటు మహబూబాబాద్‌, జనగామ, పరకాల, నర్సంపేట తదితర పట్టణాల్లో ఈయాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. ‘రమ్మీ కల్చర్‌’, ‘ఎ 23 రమ్మీ’, వెల్త్‌ రమ్మీ’, ‘జంగిల్‌ రమ్మీ’.. వంటి యాప్‌లు టాప్‌–డౌన్లోడెడ్‌గా ఉన్నాయి. టెలిగ్రామ్‌ చానల్స్‌ ద్వారా ‘100 శాతం గెలుపు ట్రిక్స్‌’, ‘మీకు మద్దతు అందించే రమ్మీ టీచర్స్‌’.. తదితర పేర్లతో ఇన్‌ఫ్లుయెన్సర్లు మోసం చేస్తూనే ఉన్నారు.

అందరూ టార్గెటే..

యూత్‌ నుంచి గృహిణుల దాకా.. అన్ని వర్గాలను ఈ రమ్మీ యాప్‌లు టార్గెట్‌ చేస్తూ విస్తరిస్తున్నాయి. బీటెక్‌, డిగ్రీ, ఇంటర్‌ విద్యార్థులు.. ఇలా అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా హనుమకొండ, కాజీపేట, వరంగల్‌ ట్రైసిటీ పరిధి విద్యాసంస్థల్లో చదివేవారు, ప్రైవేట్‌ టీచర్లు, క్లర్కులు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వర్గాలు, గృహిణులు ‘టైమ్‌ పాస్‌’గా మొదలుపెట్టి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో భారీగా డబ్బులు కోల్పోయిన సుమారు 20 మందికి పైగా వివిధ ప్రాంతాల్లో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

గేమ్‌ మాఫియా.. ‘బ్రోకర్‌’ వ్యవస్థ

ఉమ్మడి వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో రమ్మీ గేమ్‌ యాప్‌ల వినియోగం విచ్చలవిడిగా సాగుతున్నదని, వాటి పట్ల ఆకర్షితులు కావొద్దని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌లు ఇప్పటికి చాలా సార్లు హెచ్చరించారు. ప్రధానంగా వరంగల్‌ ట్రై సిటీలో మూడు టెలిగ్రామ్‌ గ్రూపుల ద్వారా రెండు లక్షల రూపాయల వరకు రోజువారీ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సైబర్‌ పోలీసుల అనుమానం. ఈగ్రూపులకి ‘మాస్టర్‌ బ్రోకర్లు’ నిధులు సమకూరుస్తూ యువతకు ‘విజయం’ చూపించి మాయ చేస్తున్నట్లు సమాచారం.

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హన్మకొండ : హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈనెల 14న విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. నరేంద్రనగర్‌, జూలైవాడ ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు, వడ్డేపల్లి, విజయపాల్‌ కాలనీ, రాఘవేంద్రనగర్‌ ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. అలాగే వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌ టౌన్‌ డీఈ ఎస్‌.మల్లికార్జున్‌ తెలిపారు. పిన్నవారి స్ట్రీట్‌, దుర్గేశ్వర స్వామి దేవాలయం, మట్టెవాడ, ఎల్లంబజార్‌ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 12 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడతాం

టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ

సభ్యుడు వెంకటరెడ్డి

న్యూస్‌రీల్‌

గేమింగ్‌ ముసుగులో ఆన్‌లైన్‌ జూదం

కేరాఫ్‌గా మారిన ఉమ్మడి వరంగల్‌

‘టైమ్‌ పాస్‌’తో మొదలై అప్పుల ఊబిలోకి

ప్రాణాలు తీసుకుంటున్న యువత

అవగాహన కల్పిస్తున్నా మారని తీరు

మోసం ఎలా జరుగుతుందంటే?

మొదటి మూడు గేమ్‌లు గెలిచేలా ఈ యాప్‌లను రూపొందించి నమ్మకం కలిగేలా చేస్తారు. మూడు గేమ్‌ల తర్వాత చివరికి ‘ఆటో బాట్‌’ వాడడం వల్ల యూజర్‌ గెలిచే అవకాశం కనీస స్థాయికి దిగిపోతుంది. యూజర్‌ నెగ్గడం పక్కన పెడితే.. ఒక వేల గెలిచినా ఆ డబ్బును దక్కించుకోలేక పోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా గెలుచుకున్న డబ్బును విత్‌ డ్రా చేసుకోవడంలో ఆలస్యం జరిగితే పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పలువురు బాధితులు తెలిపారు. కాగా.. గేమ్‌లోకి ‘ఫ్రెండ్స్‌ని లాగితే రూ.100 బోనస్‌’.. అంటూ రెఫరల్‌ మాయాజాలంతో పాటు అనేక రకాలుగా వల వేస్తున్నట్లు యాప్‌ వాడుతున్నవారు చెబుతున్నారు.

హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభించినప్పటికీ..

తెలంగాణ వ్యాప్తంగా సైబర్‌ సెల్‌ 2024లో ‘గేమింగ్‌ యాప్‌ మోసాల’పై స్పెషల్‌ హెల్ప్‌లైన్‌ ప్రారంభించింది. డిజిటల్‌ డిటాక్స్‌ క్యాంపెయిన్‌ ద్వారా పదుల సంఖ్యలో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే యాప్‌లు విదేశీ సంస్థల ఆధీనంలో ఉండడం వల్ల వాటిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టంగా మారుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తద్వారా వారించే వారికన్నా గేమ్‌ యాప్‌లు వినియోగించే వారే ఎక్కువవుతున్నారని ఓ పోలీస్‌ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’1
1/5

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’2
2/5

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’3
3/5

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’4
4/5

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’5
5/5

మాకూ కావాలి ‘స్లాట్‌ బుకింగ్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement