
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. చాలా ముఖ్యమైన వ్యక్తిని మంగళవారం క్షమించనున్నుట్లు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి లీకర్ ఎడ్వర్డ్ స్నోడెన్ లేదా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్‌లు మాత్రం కాదని తెలిపారు ట్రంప్. విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘రేపు చాలా ముఖ్యమైన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టబోతున్నాను’ అన్నారు. అయితే అతడు స్నోడెన్, ఫ్లిన్ అయ్యే అవకాశం లేదన్నారు ట్రంప్. ఇంతకు మించి దీని గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
స్నోడెన్ ఎన్‌ఎస్‌ఏకు చెందిన దేశీయ, అంతార్జతీయ నిఘా కార్యకలాపాలకు సంబంధించిన రహస్య ఫైళ్లను 2013లో వార్తాసంస్థలకు లీక్ చేశాడు. ప్రస్తుతం అతడు రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ట్రంప్ స్నోడెన్‌కు క్షమాభిక్షను పరిశీలిస్తున్నట్లు తెలిపారు ట్రంప్. గత నెలలో ట్రంప్ తన అధ్యక్ష అధికారాన్ని ఉపయోగించి తన చిరకాల మిత్రుడు, సలహాదారు రోజర్ స్టోన్ శిక్షను రద్దు చేశారు. అతడు 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు చేస్తోన్న చట్టసభ సభ్యులు అతడిని దోషిగా తేల్చారు. (తీవ్ర విషాదంలో డొనాల్డ్ ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment