మాస్కో: రష్యాలో బుధవారం జరిగిన విమానంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ మృతిచెందారని రష్యా పౌర విమానయాన సంస్థ ‘రోసావియాత్సియా’ ధ్రువీకరించింది. ప్రిగోజిన్ సహా విమానంలో ఉన్న మొత్తం 10 మంది చనిపోయారని నిర్ధారించింది. రష్యా కిరాయి సైనిక దళమైన వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడింది. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ కొన్నిరోజుల క్రితం రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గారు.
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటును రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశద్రోహం, వెన్నుపోటుగా అభివరి్ణంచారు. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కొన్నిరోజులు పుతిన్ వెనక్కి తగ్గారని, ప్రిగోజిన్‌కు క్షమాభిక్ష ప్రసా దించి, పొరుగు దేశమైన బెలారస్‌కు పంపించినట్లు వార్తలు వచ్చాయి. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఈ ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఉందని, ప్రిగోజిన్‌ను మట్టుబెట్టడానికే ఉద్దేశపూర్వకంగా విమాన ప్రమాదాన్ని సృష్టించారని ఉక్రెయిన్ సహా పశి్చమ దేశాలు ఆరోపిస్తున్నాయి.
ఆశ్చర్యం కలిగించలేదు: బైడెన్
మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన ప్రైవేట్ విమానం బుధవారం నేలకూలి మంటల్లో చిక్కుకుంది. మాస్కోకు ఉత్తర దిశలో 300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ముగ్గురు సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉండగా, అందరూ దుర్మరణం పాలయ్యారు. ప్రిగోజిన్ సహా వాగ్నర్ గ్రూప్ లెఫ్టినెంట్లు మరణించినట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున 10 మృతదేహాలను రష్యాఅధికారులు గుర్తించారు. ఈ విమానాన్ని ప్రిగోజిన్ తరచుగా ఉపయోగించేవారని తెలుస్తోంది.
వైమానిక భద్రతా నిబంధలను ఉల్లంఘించడం వల్ల ప్రమాదం జరిగిందన్న కోణంలో అధికారులు ప్రారంభించారు. ప్రమాదానికి కారణం ఏమిటన్నది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రిగోజిన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అసలేం జరిగిందో తెలియదు గానీ ప్రిగోజిన్ మరణం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. ప్రిగోజిన్‌ను పుతినే హత్య చేయించారన్నట్టుగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై పుతిన్ మౌనం వీడలేదు. గురువారం ఆయన బ్రిక్స్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రిగోజిన్ మరణం గురించి ప్రస్తావించలేదు.
ఇది కూడా చదవండి: రష్యాలో విమాన ప్రమాదం..వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి
Comments
Please login to add a commentAdd a comment