
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీ కొనడంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. సింధ్ ప్రాంతంలోని ఘోట్కిలోని రెటి, దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు మిల్లట్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. దీంతో మిల్లాట్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు బోల్తాపడ్డాయి. ఘోట్కి, ధార్కి, ఒబారో, మీర్పూర్ మాథెలో పాంత్రాల్లోని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఘోట్కి డిప్యూటీ కమిషనర్ ఉస్మాన్ అబ్దుల్లా తెలిపారు.
ఈ ప్రమాదంలో సుమారు 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పగా.. ఆరు నుండి ఎనిమిది పూర్తిగా నాశనమైనట్లు ఆయన పేర్కొన్నారు. గాయపడిన ప్రయాణికులకు వైద్య సహాయం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని విధుల్లోకి రావాల్సిందిగా పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. అంతేకాకుండా సహాయ చర్యల కోసం రోహ్రీ నుంచి రైలు బయలుదేరిందని పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్టు పేర్కొన్నారు.
(చదవండి: ఈ మామిడి పండు ఖరీదు రూ.1000 గురూ!)
Comments
Please login to add a commentAdd a comment