Live Updates
అణ్వాయుధాలకు చేరువలో ఇరాన్.. ఆయుధాలు అందితే వినాశనమే?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎయిరిండియా ప్రత్యేక సర్వీసులు
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిరిండియా ప్రత్యేక చర్యలు..
- దుబాయ్, జెడ్డాలకు ప్రత్యేక విమానాలు..
- ఢిల్లీ, ముంబయి నుంచి ఈ ప్రత్యేక విమానాలు నడుస్తాయని వెల్లడి..
బుధవారం స్వదేశానికి రానున్నట్లు ఎయిరిండియా వెల్లడి..
టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి..
- ఇరాన్ దాడుల తర్వాత సైప్రస్‌లో సైనిక మోహరింపు పెంచిన బ్రిటన్
- టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై దాడి..
- టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై వైమానిక దాడులు..
- విమానాశ్రయంలో భారీగా మంటలు..
- తూర్పు టెహ్రాన్‌లోని హకీమియా ప్రాంతం లక్ష్యంగా దాడులు..
- దాడులకు ముందే టెహ్రాన్‌లోని రాబోయే గంటల్లో సైనిక చర్య ప్రారంభిస్తామని స్థానికులను హెచ్చరించిన ఇజ్రాయెల్ సైన్యం..
- దాడిలో ధ్వంసమైన ప్యాసింజర్ విమానం
ఇజ్రాయిల్ కొత్త రక్షణమంత్రి మృతి: ఇజ్రాయిల్ మీడియా
- తాజా దాడుల్లో మజీద్ ఆల్‌రెజా మృతిచెందినట్లు వెల్లడి
- రక్షణమంత్రిగా నిన్నే బాధ్యతలు చేపట్టిన మజీద్ అల్ రెజా
ఇరాన్‌పై దాడి ఎలా చేస్తారు.. ట్రంప్‌పై వ్యతిరేకత
- పార్లమెంట్ అనుమతి లేకుండా యుద్ధం ఎలా చేస్తారు
- ట్రంప్ సమాధానం చెప్పాలన్న.. ఐలాండ్ సెనేటర్ జాక్ రీడ్
- ఏ అధికారంతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ట్రంప్‌కు ప్రశ్న
- ఇరాన్ విషయంలో ప్రభుత్వ లక్షమేమిటని ప్రశ్నించిన జాక్‌రీడ్
టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడులు
- టెల్ అవీవ్ జిల్లాలలో మిసైల్స్ దాడులు
- 12 మందికి గాయాలైనట్లు ప్రకటించిన ఇజ్రాయెల్
ఇరాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
- చారిత్రక గోల్డెన్ ప్యాలెస్‌పై వైమానిక దాడి
- మెహ్రాబాద్ ఎయిర్‌పోర్టుపై బాంబుల దాడి
- ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన ప్యాసింజర్ విమానం
పెట్రో ఉత్పత్తుల అందుబాటుపై ఆందోళన అవసరం లేదు: కిషన్‌రెడ్డి
- అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో.. అంతర్జాతీయంగా చమురు సరఫరా, భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల అందుబాటుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంది.
- భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో ఐదో స్థానంలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో భారతదేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు.
- దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) వంటి పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి.
ఇరాన్‌లోని బుషెహర్ నగరంపై ఇజ్రాయిల్ దాడి
- నేవల్ బేస్ లక్ష్యంగా ఇజ్రాయిల్ మిసైళ్ల దాడి
- సమీపంలోని రష్యా రోసాటోమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్
- సిబ్బంది తక్షణమే వెళ్లిపోవాలని రష్యా ఆదేశం
పెరిగిన చమురు ధరలు
- భారీగా పెరిగిన ముడిచమురు ధరలు
- 85 డాలర్లకు చేరిన బ్యారెల్ ముడిచమురు ధర
- ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంతో భారీగా పెరిగిన ధరలు
రష్యా న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో ఇరాన్ దాడి
- ఇరాన్‌లోని బుషెహర్ నగరంపై ఇజ్రాయెల్ దాడి
- నేవల్ బేస్ లక్షంగా ఇజ్రాయెల్ మిసైళ్ల దాడి
- సమీపంలోనే రష్యా రోసోటోమ్ న్యూక్లియర్ పవర్‌ప్లాంట్
అక్కడినుంచి సిబ్బంది తక్షణమే వెళ్లిపోవాలని రష్యా ఆదేశం
లెబనాన్‌పై ఇజ్రాయెల్ గ్రౌండ్స్ దాడులు
- దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్స్
- సరిహద్దు నుంచి వైదొలుగుతున్న లెబనాన్ బలగాలు
పెట్రోల్, డీజిల్‌పై భారత్ కీలక ప్రకటన
- భారత్‌లో 25 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ స్టాక్
- ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఆలోచన లేదన్న భారత
- మరో 25 రోజుల పాటు ఇబ్బంది లేదన్న భారత్
- ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని వెల్లడి
- హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు కొరత ఏర్పడే అవకాశం
ఈయూ నేతలతో భారత విదేశాంగ శాఖ మంత్రి మంతనాలు
- గల్ఫ్ దేశాల్లో కోటికి పైగా భారతీయులున్నారు
- భారతీయుల భద్రతే మాకు ముఖ్యమన్న జైశంకర్
- గల్ఫ్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో జైశంకర్ కీలక చర్చలు
ఒమన్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి
- దోఫర్‌లో రెండు డ్రోన్లను అడ్డుకున్న ఇరాన్
- సలాల పోర్టు సమీపంలో కూలిన డ్రోన్
యూఏఈలో ముగ్గురు మృతి
- ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి, 68 మందికి గాయాలు
- మృతి చెందినట్లు ప్రకటించిన యూఏఈ రక్షణశాఖ
ఆహర ఎగుమతులను నిలిపివేసిన ఇరాన్
- తదుపరి ఆదేశాల వరకూ ఆహర ఉత్పత్తులు నిలివేయాలని ఆదేశాలు
- యుద్ధం రీత్యా ఆహర ఉత్పత్తులను నిల్వ చేయనున్న ఇరాన్
టెహ్రాన్‌లో మరోసారి పేలుళ్లు
టెహ్రాన్‌లో మరోసారి భారీ పేలుడు శబ్దం
టెహ్రాన్‌లో పేలుళ్ల వివరాలు ప్రకటించిన ఆదేశ న్యూస్ ఏజెన్సీ
అణ్వాయుధాలకు చేరువలో ఇరాన్
- ఇరాన్ అణ్వాయుధాలపై నాటో జనరల్ సెక్రటరీ రుట్టే ప్రకటన
- ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించడానికి అతి దగ్గరగా ఉంది ఉంది
- NATO మరియు మిత్ర దేశాలకు ప్రమాదం పెరిగిందని హెచ్చరిక
ఇరాన్ వార్ అప్‌డేట్స్
- మోజ్తాబా ఖమేనీ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం మెరుగ్గా ఉందని ప్రకటన
- మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు
- ఇటీవలి ఊహాగానాల రీత్యా ఆయన ఆరోగ్య వివరాలు ప్రకటన
- ఆయన ఆరోగ్య వివరాలు ప్రకటించిన మెహర్ న్యూస్ ఏజెన్సీ
చర్చలకు ఇరాన్ ప్రయత్నించింది: ట్రంప్
- ఇరాన్ చర్చలకు ఆహ్వానించింది: డొనాల్డ్ ట్రంప్
- ఇరాన్ మంత్రి చర్చలకు తాము సిద్ధమన్నారు.
- అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నాను
- ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్‌ఫోర్స్, నావీ తుడిచి పెట్టుకుపోయింది
- ట్రూత్‌లో ట్రంప్ వెల్లడి
40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ చేరుకున్న విమానం
- హైదరాబాద్ చేరుకున్న ఒమన్ ఎయిర్‌వేస్ విమానం
- మస్కట్ నుంచి శంషాబాద్ చేరుకున్న విమానం
- టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని ప్రయాణికుల ఆవేదన
- ఒమన్ ఎయిర్‌వేస్ విమానాలు మాత్రమే నడుస్తున్నాయని ఆందోళన
40 మంది ప్రయాణికులతో భారత్‌కు విమానం
- 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ చేరుకున్న విమానం
- హైదరాబాద్ చేరుకున్న ఒమన్ ఎయిర్‌వేస్ విమానం
- మస్కట్ నుంచి శంషాబాద్ చేరుకున్న విమానం
పశ్చిమాసియా ఉద్రిక్తత.. 8మంది దేశాధినేతలకు మోదీ ఫోన్
- గడిచిన 48 గంటల్లో 8మంది దేశాదినేతలకు మోదీ ఫోన్
- యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, జోర్ధాన్ దేశాధినేతలకు మోదీ ఫోన్
- బహ్రెయిన్, ఒమన్,కువైట్, ఖతార్, దేశాధినేతలకు మోదీ ఫోన్
- యుద్దం నేపథ్యంలో ఫోన్‌లో మాట్లాడిన భారత ప్రధాని
- ఆ దేశాల్లో పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం
ఇరాన్ నూతన రక్షణ మంత్రి మృతి
- తాజాగా ఇరాన్‌పై జరిగిన దాడుల్లో మజీద్-అల్-రెజా మృతి
- ఇరాన్ రక్షణ మంత్రి మరణించినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్
ఇరాన్‌లో పాఠశాలపై జరిగిన దాడిపై కీలక దర్యాప్తు
- అమెరికా, ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపాయని ఆరోపణ
- దాడులను దర్యాప్తు చేసిన అల్ జజీరా దర్యాప్తు సంస్థ
- అల్-షాజారా-అల్ తయ్యిబా పాఠశాల పదేళ్ల క్రితమే వేరు చేయబడింది
- పదేళ్ల క్రితమే ఇరాన్ సైనిక స్థావరాల నుంచి మార్చారని ప్రకటన
- ఆ కాలం నాటి ఊహాచిత్రాలను విడుదల చేసిన ఇరాన్ దర్యాప్తు సంస్థ
- దాడులలో 180 మంది మృతి చెందారు. అందులో 165 మంది బాలికలు
- చనిపోయిన వారందరిని ఒకే దగ్గర సమాధి చేయనున్న ఇరాన్
- ఈరోజు జరిగిన అంతిమ యాత్రలో పెద్దఎత్తున పాల్గొన్న ఇరాన్ ప్రజలు
- అయితే ఈ దాడులు ప్రమాదవశాత్తు జరిగాయని పేర్కొన్న అమెరికా
Hundreds of thousands of brave Iranians in #Minab County at the funeral of 165 elementary school girls who were massacred in joint US-Israeli attacks pic.twitter.com/qZRiQAh0hw
— Iran Military Monitor (@IRIran_Military) March 3, 2026
ఒమన్, కువైట్ దాడులపై భారత ప్రధాని ఆందోళన
- ఒమన్ సుల్తాన్, కువైట్ రాజుతో మాట్లాడిన ప్రధాని
- ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్‌తారిక్‌తో ఫోన్‌లో మాట్లాడిని మోదీ
- కువైట్ రాజు షేక్ సబా అల్- ఖలీద్ ముబారక్‌తో మాట్లాడిన మోదీ
అణుయుద్దానికి దారి తీయవచ్చు: రష్యా
- పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన రష్యా
- ఈ ఉద్రిక్తతలు అణుయుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందన్న రష్యా
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై స్పందించిన.. IMF
- పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితిని గమనిస్తున్నాం
- చమురు వాణిజ్యం ఆటంకం, ధరల పెరుగుల గమనిస్తున్నాం
- ఈ యుద్ద ప్రభావం ప్రపంచంపై ఎలా పడుతుందో ఇప్పుడే చెప్పలేం
- ఇంత తొందరగా ఆర్థిక అంశాలను అంచనా వేయలేమన్న IMF
ఇరాన్‌లో జరిగిన పాఠశాల దాడిపై UNO స్పందన
- బాలికల పాఠశాలపై జరిగిన దాడిపై విచారణకు ఆదేశం
- విచారణ వివరాలు తెలిపిన UNO ప్రతినిధి రవినా శందసాని
- ఇరాన్‌పై తొలిరోజు పాఠశాలపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్
- ఆ దాడిలో 153 మంది బాలికలు మృతిచెందినట్లు ప్రకటన
- అయితే ఆ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదన్న అమెరికా
ఇరాన్ దాడులు.. ఆరుగురు USA సైనికులు మృతి
- కువైట్‌లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు
- దాడుల్లో ఆరుగురు అమెరికా సైనికులు మృతి
లెబనాన్‌లో నిరాశ్రయులైన 30 వేల మంది
- ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 30 వేల మంది నిరాశ్రయులు
- ఇజ్రాయెల్ దాడులు హెచ్చరికలతో గ్రామాలు వదిలిన ప్రజలు
- దాడుల హెచ్చరికలతో 53 గ్రామాలు ఖాళీ
- నిరాశ్రయుల వివరాల ప్రకటించిన UNO
మా భూభాగం మొత్తం లక్ష్యంగా చేసుకుని దాడులు: ఖతార్
- దేశ మొత్తం భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని మాపై దాడులు జరుగుతున్నాయి
- దాడులకు ముందు ఇరాన్ తమను ముందుగానే హెచ్చరించలేదని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్-అన్సారీ
- ఈ దాడులు సైనిక స్థావరాలకు మాత్రమే పరిమితం కావు,
- కానీ దేశంలోని మొత్తం భూభాగాన్ని కలిగి ఉన్నాయి. దాడులకు సమాధానం ఇవ్వకుండా ఉండదు.
- రెండు ఇరాన్ యుద్ధ విమానాలను కూల్చివేయడానికి ముందు హెచ్చరించారు, వారి సిబ్బంది కోసం వెతుకుతున్నారు.
- ఖతార్ తనను బెదిరించలేమని నిరూపించింది.
- మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. మా ఇంటర్ సెప్టర్ క్షిపణుల నిల్వ తగ్గలేదు.
- కొనసాగుతున్న ముప్పును ఎదుర్కోవటానికి మాకు తగినంతగా ఉంది.
UAE పుజైరా చమురు నిల్వ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
- గాలిలో శత్రువుల డ్రోన్లను ధ్వంసం చేసిన UAE
- ధ్వంసం చేసిన శిథిలాలు ఆయిల్ జోన్‌పై పడడంతో అగ్నిప్రమాదం
- ఒమన్ ఆగ్నేయ తీరంలోని దుక్మ్ ఓడరేవుపై ఇరాన్ దాడి
- ఇరాన్ డ్రోన్ల దాడిలో ధ్వంసమైన ఇంధన ట్యాంక్
- ఇప్పటి వరకూ దుక్మ్ ఓడరేవుపై రెండుసార్లు ఇరాన్ దాడి
టెహ్రాన్‌లో ఉన్న భారతీయులకు కీలక ఆదేశాలు
- టెహ్రాన్‌లోని చాలా మందిని ఇప్పటికే వివిధ ప్రాంతాలకు తరలించాం
- ఆ దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించిన భారత ఎంబసీ
- తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎంబసీ ప్రకటన
- సూచనలను పట్టించుకోని కొంతమంది టెహ్రాన్‌లో ఉన్నారు:ఎంబసీ
- వారికోసం ప్రత్యేక సూచనలు చేసిన భారత ఎంబసీ
- ఇండ్లలోంచి బయిటకి రావద్దు, కిటికీలకు దూరంగా ఉండాలి
- నిరసనలు జరిగే ప్రదేశానికి దూరంగా ఉండాలి
- ఇరాన్‌లోని భారత ఎంబసీకీ కాంటాక్ట్‌లో ఉండాలి
గల్ఫ్ దేశాలపై విరుచుకపడుతున్న ఇరాన్
- ఒమన్ ఆగ్నేయ తీరంలోని దుక్మ్ ఓడరేవుపై దాడి
- ఇరాన్ దాడిలో ధ్వంసమైన ఇంధన ట్యాంక్
- ఇప్పటివరకూ దుక్మ్ ఓడరేవుపై రెండుసార్లు ఇరాన్ దాడి
ఇరాన్ అధ్యక్షుడి భవనంపై ఇజ్రాయెల్ దాడి
- టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
- ఇరాన్ అధ్యక్షుడి కార్యాలయంపై దాడి
- నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ బిల్డింగ్‌పైన దాడి
- దాడి వివరాలను ప్రకటించిన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్
గల్ఫ్ నుంచి ప్రారంభమైన విమానాలు
- గల్ఫ్ దేశాల నుంచి ప్రారంభమైన విమాన రాకపోకలు
- దుబాయ్,మస్కట్, అబుదాబి నుంచి భారత్‌కు విమానాలు
- ఢిల్లీకి చేరుకున్న 2 విమానాలు
యుద్ధ ఉద్రిక్తతలు.. గగనతలం మూసేసిన పాక్
- గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్
- ఇరాన్‌తో యుద్ధం కారణంగా గగనతలం మూసివేస్తున్నట్లు ప్రకటన
- ఈ నెలాఖరు వరకూ వాణిజ్య విమానాలకు అనుమతి నిరాకరణ
యూఏఈలో ఉన్న భారతీయులకు కీలక సూచన
- అనవసర ప్రయాణాలని వాయిదా వేసుకోవాలన్న విదేశాంగశాఖ
- UAE మార్గదర్శకాలను పాటించాలని కోరిన భారత్
- పరిస్థితులు సద్ధమణిగేవరకూ సంయమనం పాటించాలని వినతి
- ఎదైనా అత్యవసరమైతే టోల్‌ఫ్రీ నెం. 800-46342, వాట్సాఫ్ + 971543090571
హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలకు ఇరాన్ హెచ్చరిక
- జలసంధిని దాటాలని ప్రయత్నిస్తే తగలబెడతామని హెచ్చరిక
- జలసంధి మూసివేతతో అక్కడ చిక్కుకున్న 700 నౌకలు
- చమురు నౌకలు చిక్కుకోవడంతో భారత్ సహా పలు ఆసియా దేశాలపై ప్రభావం
ముగ్గురు భారత నావికుల మృతి
- పశ్చిమాసియా యుద్ధంలో ముగ్గురు భారత నావికుల మృతి
- ఒమన్ తీరప్రాంతాల్లో ఉన్న వాణిజ్య నౌకలపై దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
- ముగ్గురు భారత నావికులు మృతిచెందినట్లు షిప్పింగ్ డీజీ ప్రకటన
పాకిస్తాన్‌లో అమెరికా కాన్సులేట్‌కు నిప్పు
- పాకిస్తాన్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు నిప్పు
- లాహోర్‌లో ఉన్న అమెరికా కాన్సులేట్‌కు పాకిస్థానీయులు నిప్పు
SHOCKING NEWS 🚨 Pakistanis have set fire to the American consulate in Lahore 🤯 pic.twitter.com/3SCdv9K2dE https://t.co/XHgCNqxF7G
— News Algebra (@NewsAlgebraIND) March 3, 2026
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 787 మంది మృతి
- ఇరాన్: ఇరాన్ భూభాగంపై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 787 మంది మృతి
- అమెరికన్-ఇజ్రాయెల్ దాడుల్లో 787 మంది మరణించారని ఇరాన్ పేర్కొంది.
- రెడ్ క్రెసెంట్ ను ఉటంకిస్తూ దేశంలోని మీడియా సంస్థలు ఈ విషయాన్ని నివేదించాయి.
- ఇజ్రాయెల్‌లో ఒక అంచనా ప్రకారం, ఇరాన్ భూభాగంలో ఐడిఎఫ్ మరియు యుఎస్ సైన్యం సంయుక్తంగా చేసిన దాడిలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా రివల్యూషనరీ గార్డ్స్ సభ్యులు మరణించారు.
ఇరాన్‌తో యుద్ధం వేళ.. గ్రౌండ్ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్‌కు గ్రీన్ సిగ్నల్
- ఇరాన్‌తో యుద్ధం వేళ గ్రౌండ్ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్‌కు గ్రీన్ సిగ్నల్
- లెబనాన్‌లో పదాతి దళాల ఆపరేషన్‌కు ఆమోదం తెలిపిన నెతన్యాహు
- గ్రౌండ్ ఆపరేషన్‌ను ధ్రువీకరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్
- హెజ్‌బొల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ బలగాలు
గల్ఫ్ దేశాల నుంచి పాక్షికంగా విమాన సేవలు పునరుద్ధరణ
- దుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఎయిరిండియా విమానం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 149 మంది ప్రయాణికులు
- స్వదేశానికి చేరుకున్న భారత షట్లర్ పీవీ సింధు
- దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న పీవీ సింధు
- బర్నింగ్ హామ్ వెళ్లాల్సిన సింధు.. యుద్ధం కారణంగా రిటర్న్
యూఎస్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కీలక మలుపు
- ఇరాన్‌కు మద్దతుగా గళం విప్పిన చైనా
- ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలి: చైనా
- ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామన్న చైనా
హార్ముజ్ జలసంధి దగ్గర చిక్కుకుపోయిన 700లకు పైగా నౌకలు
- ఇరాన్ అధికారికంగా హార్ముజ్ జలసంధి మూసివేత
- నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ హెచ్చరిక
- ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి.
- వాటిలో 100 కంటైనర్ షిప్స్
- మార్చి 1వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బైటకు వెళ్లగా..
- మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్, కార్గోషిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు
ఇరాన్ రాజధాని టెహ్రోన్‌లో భారీ పేలుళ్లు
- నగరం నడిబొడ్డున కీలక ప్రభుత్వ భవనాలపై దాడులు
- బ్రహెయిన్‌లో ఎంబసీ అధికారులకు అమెరికా ఆదేశాలు
- ఉద్యోగులు, వారి కుటుంబాలు తక్షణమే దేశం వీడాలని ఆదేశం
బ్రహెయిన్ లక్ష్యంగా డ్రోన్, మిస్సైళ్లతో ఇరాన్ దాడులు
- అమెరికా నౌకాదళ కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ దాడులు
- మనామాలోని క్రౌన్ ప్లాజా హోటళ్లపై దాడులు
- భద్రతా కారణాల దృష్ట్యా బ్రహెయిన్ ప్రభుత్వం అలర్ట్
- జుపైర్‌లోని పలు ప్రాంతాలు ఖాళీ, మూతపడిన పాఠశాలలు
🚨‼️🔥Strong Iranian strikes on Bahrain now, and the sound of explosions can be heard throughout the capital, Manama. pic.twitter.com/BcUha7Mlc9
— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) March 3, 2026
హోర్ముజ్ జలసంధి మూసివేతపై ఇరాన్ ప్రకటన
- ప్రపంచ చమురు సరఫరాకు పెను ముప్పు
- మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ..
- ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన సైనిక విభాగం (IRGC) హోర్ముజ్ జలసంధిని నౌకాయానానికి మూసివేశామని ప్రకటన
- ఈ మార్గం గుండా ప్రయాణించే ఏ నౌకనైనా తగలబెడతామని హెచ్చరిక
- ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడి
హిజ్బొల్లా దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం
సౌత్ లెబనాన్‌పై హిజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఎటాక్
బీరూట్‌లో హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు
బహ్రయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌దాడి
- గల్ఫ్ దేశాలపై వందలాది క్షిపణులు, డ్రోన్‌లతో ఇరాన్ దాడి
- 178 బాలిస్టిక్ క్షిపణులను, 384 డ్రోన్‌లను కూల్చిన కువైట్
- 169 క్షిపణులను కూల్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)
- 70 క్షిపణులను 76 డ్రోన్‌లను అడ్డుకున్న బహ్రెయిన్
- 101 క్షిపణులను, అలాగే 39 డ్రోన్‌లలో 24 క్షిపణులను అడ్డగించిన ఖతార్
- మొత్తం 104 గుర్తించిన వాటిలో రెండు ఇరానియన్ SU-24 బాంబర్ విమానాలను కూల్చివేత
- రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఇరానియన్ డ్రోన్‌లతో ధ్వంసం
- రియాద్, అల్-ఖార్జ్ నగరాల సమీపంలో ఎనిమిది డ్రోన్‌లను అడ్డగించిన సౌదీ
The US and Israeli air war against Iran widened, with no end in sight as Israel attacked Lebanon in response to strikes by Hezbollah and Tehran kept up its missile and drone attacks on Gulf states https://t.co/5w0c45DZF5 pic.twitter.com/qz9FKX97MV
— Reuters (@Reuters) March 3, 2026
ఇరాన్ విదేశాంగమంత్రి అరగ్చీ కీలక వ్యాఖ్యలు
- ఇరాన్ విదేశాంగమంత్రి అరగ్చీ కీలక వ్యాఖ్యలు
- ఇవాళ పుతిన్‌తో చర్చలు జరుపుతాం
- ఇప్పటికే తుర్కియే అధ్యక్షుడితో మాట్లాడామన్న ఇరాన్ మంత్రి
బహ్రయిన్‌లో చెలరేగిన అల్లర్లు
- బహ్రయిన్‌లో చెలరేగిన అల్లర్లు
- ఖమేనీ హత్యకు నిరసనగా రోడ్డెక్కిన షియా కమ్యూనిటీ
- నిరసనకారులపై బహ్రయిన్ పోలీసుల లాఠీఛార్జ్, కాల్పులు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శపథం
- ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, తయారీ కేంద్రాలను నాశనం చేస్తాం
- ఇరాన్ నావికాదళాన్ని ఇప్పటికే తుడిచిపెట్టామన్న ట్రంప్
- ఇరాన్ క్షిపణ కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచింది
- అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలకు పెనుసవాల్‌గా మారింది
- ఐరోపా దేశాలతో పాటు అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల క్షిపణులను ఇరాన్ చేస్తోంది
- ముప్పును ఇప్పుడే ఆపాలన్న ట్రంప్
- లక్ష్యాలను సాధించడానికి మరో 4 నుంచి 5 వారాల సమయం:
- అవసరమైతే గ్రౌండ్ ట్రుప్స్ పంపడానికీ వెనకాడబోమన్న ట్రంప్
రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి
- డ్రోన్ దాడిలో భవనానికి స్వల్ప నష్టం: సౌదీ రక్షణ శాఖ
- ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న సౌదీ రక్షణ శాఖ
- లెబనాన్ రాజధాని బీరూట్ శివారులో ఇజ్రాయెల్ భీకర దాడులు
- హిజ్బుల్లా బలమైన కోట దహీయా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
- హిజ్బుల్లా అల్-మనార్ టీవీ స్టేషన్ లక్ష్యంగా దాడులు
A fire at the US embassy in Riyadh following explosions in the diplomatic quarter. One of the officials confirmed a drone kamikaze attack on the embassy
The footage was published by the IRGC. Preliminarily,the video shows the city's Southern Ring Road#Iran #IsraelIranWar #Riyadh pic.twitter.com/aAi6IX6S1l— deepankarthish (@deepankarthishb) March 3, 2026
మరో నాలుగైదు వారాలు: ట్రంప్
- ఇరాన్‌పై దాడులు మరో నాలుగైదు వారాల పాటు కొనసాగుతాయి
- అవసరమైతే మరింత సుదీర్ఘ పోరుకూ సిద్ధం
- ఇరాన్ దాడుల్లో మరణించిన నలుగురు అమెరికా సైనికుల కుటుంబాలకు సంతాపం
- ‘బాధాకరమే అయినా, యుద్ధం ముగిసేలోపు ఇలాటి మరణాలు మరిన్ని సంభవిస్తాయి
- అది అనివార్యం. ఏమీ చేయలేం
- ఇరాన్‌పై దాడిలో గల్ఫ్ దేశాలన్నీ తమతో కలిసొస్తామంటున్నాయి.
- ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు తాను సిద్ధం
- ప్రస్తుతానికి మాత్రం ఇరాన్‌పై దాడులు పూర్తిస్థాయి తీవ్రతతో కొనసాగుతాయి
130 నగరాలపై దాడి, 600 దాటిన మృతులు
- పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు
- ఇరాన్‌కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు
- అమెరికాకు మద్దతుగా నిలుస్తామన్న యూరప్
- ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం
- క్షిపణి కేంద్రాలు, యుద్ధ నౌకలే లక్ష్యం
- ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ హెజ్బొల్లా
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి
- ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు
- నేలకూలిన 3 అమెరికా యుద్ధ విమానాలు
- కువైట్ పొరపాటున కూల్చేసింది: యూఎస్


