Live Updates
ఇరాన్ కీలక అధికారి మృతి
గమ్యం లేకుండానే బయల్దేరిన విమానం..!
- గాలిలో 8 గంటల ప్రయాణం తర్వాత యూ-టర్న్
- అనుమతి లేకుండానే పొరపాటున కెనడాకుబయల్దేరిన విమానం
- ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత తిరిగి ఢిల్లీకి
- ప్రయాణికులకు నిరర్థకంగా మిగిలిన వైనం
2026-03-20 21:57:10
నాటో కంట్రీస్‌పై ట్రంప్ సీరియస్
- నాటో మిత్ర దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు
- పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటామన్న ట్రంప్
- హార్మూజ్ విషయంలో నాటో దేశాలపై అసహానం
- తమతో కలిసి రావడం లేదని ట్రంప్ అసహానం
- ఇరాన్‌తో యుద్ధంలో చేరని పక్షంలో ట్రంప్ సీరియస్
- అమెరికా లేని నాటో పేపర్ టైగర్ లాంటిది
2026-03-20 20:10:28
పశ్చిమాసియా యుద్ధ పరిణామాలపై కేంద్రం సమీక్ష
- కొత్తగా 13, 700లకుపైగా పీఎన్‌జీ కనెక్షన్లు జారీ
- గ్యాస్ బుకింగ్స్ 89 లక్షల నుంచి 55 లక్షలకు తగ్గాయి
- బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు చర్యలు
- 24 గంటల్లో 4 వేల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం
- ప్రత్యామ్నాయ ఇంధనాలు ఉపయోగించుకోవాలి
2026-03-20 19:11:08
యుద్ధంలోకి దిగిన ఉక్రెయిన్
- ఐదు గల్ఫ్ దేశాల్లో మిలటరీ యూనిట్స్ ఏర్పాటు
- ప్రజావాసాలపై దాడి జరగకుండా యూనిట్స్ ఏర్పాటు
- ఇరాన్ డ్రోన్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్
- ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సాయం కోరిన గల్ప్ దేశాలు
2026-03-20 18:24:30
స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం
- ఆయుధాల ఎగుమతిని నిలిపివేసిన స్విట్జర్లాండ్
- పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కీలక నిర్ణయం
- అమెరికాకు ఆయుధాల ఎగుమతి ఆపేసిన స్విట్జర్లాండ్
- యుద్ధంలో మధ్యంతరంగా ఉండడానికే నిర్ణయమని వెల్లడి
2026-03-20 17:44:02
ఇజ్రాయెల్ ప్రధానిపై మండిపడ్డ ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఛెంఘిజ్ ఖాన్‌ని ప్రశంసించడంపై నెతన్యాహుపై విమర్శలు
- మా ప్రాంతం చూసిన ఘోరమైన నరహంతకుడు చెంఘిజ్ ఖాన్
- ఆయనను పొగడడం నెతన్యాహుకు సరిపోతుంది
- నెతన్యాహుపై విమర్శ చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి
2026-03-20 17:25:08
ఇరాన్ కార్గో షిప్‌లపై దాడి
- 16 కార్గో షిప్‌లపై దాడి చేసిన ఇజ్రాయెల్, ఇరాన్
- వివరాలను ధృవీకరించిన ఇరాన్
2026-03-20 16:58:23
ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు
- ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్‌కు రూ. 22 పెంచిన ఐవోసీఎల్
- రూ. 87.57 నుంచి 109.59కి పెంచిన ఐవోసీఎల్
- యుద్ధం కారణంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ దిగుమతి
- ఇప్పటికే శివారు ప్రాంతాల బంకుల్లో నో స్టాక్ బోర్డులు
2026-03-20 16:18:20
యుద్ధంలో 6కు చేరిన భారతీయుల మృతుల సంఖ్య
- సౌదీ అరేబియా రియాద్‌లో భారతీయుడు మృతి
- ఇరాన్ దాడిలో మృతిచెందిన భారతీయుడు
- ఇరాన్ దాడిలో గురువారం రాత్రి మృతి చెందిన భారతీయుడు
2026-03-20 16:09:05
- గల్ఫ్‌లోని ఎనర్జీ రిఫైనరీ స్థావరాలపై దాడి
- మినా-అల్-అహ్మాదీ రిఫైనరీ స్థావరంపై దాడి
2026-03-20 16:04:00
భారత్‌లో పవర్ పెట్రోల్ ధరలు పెంపు
- పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత్‌లో పవర్ పెట్రోల్ ధరలు పెంపు
- పవర్ పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2. 30 పెంపు
2026-03-20 15:14:43
ఇరాన్ కీలక అధికారి మృతి
- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక అధికారి అలీ మహ్మద్ నయేని మృతి
- ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లో రెండో బ్రిగేడియర్ జనరల్‌గా పని చేస్తున్న అలీ మహ్మద్ నయేని
- గతంలో ఇరాక్‌తో యుద్ధంలో కూడా కీలక పాత్ర పోషించిన నయేని
- తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో నయేని మృతిచెందినట్లు ధృవీకరణ
2026-03-20 14:50:30
ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోదీ
- ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోదీ
- ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోదీ.
- ఖతార్, ఫ్రాన్స్, ఒమన్, మలేషియా నేతలతో మోదీ చర్యలు.
- పశ్చిమాసియాలో పరిస్థితులు చేజారడంపై ఆందోళన.
2026-03-20 12:02:10
యుద్ధం పీక్స్.. డీజీసీఏ కీలక అడ్వైజరీ
- యుద్ధం పీక్స్.. డీజీసీఏ కీలక అడ్వైజరీ
- పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు..
- ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డీజీసీఏ కీలక అడ్వైజరీ జారీ
- పశ్చిమాసియాలోని తొమ్మిది దేశాల గగనతలాన్ని పూర్తిగా నివారించాలని స్పష్టం చేసింది.
- నో-ఫ్లై జోన్‌గా పలు దేశాలను ప్రకటించింది.
- ఈ జాబితాలో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్
- ఈ దేశాలకు విమానాలను నడుపవద్దని ఆదేశం
- ఈ ప్రాంతాల్లో ఏ ఎత్తులోనైనా విమానాలు ప్రయాణించకూడదని డీజీసీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ.
2026-03-20 11:41:57
ట్రంప్ సంచలన నిర్ణయం
- ఆపరేషన్ హార్మూజ్‌ను వేగవంతం చేసిన అమెరికా.
- హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు అదనపు బలగాలు పంపుతున్న అమెరికా.
- కాలిఫోర్నియా క్యాంప్ పెండిల్టన్ నుంచి బయలుదేరిన మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్
- ఈ యూనిట్‌లో 4400 మంది సైనికులు.
- ఇప్పటికే పశ్చిమాసియాలో మోహరించిన అబ్రహం లింకన్.
- దానికి అనుబంధంగా 11వ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్.
- దీంతో, ఇరాన్‌పై మరిన్ని దాడులు జరిగే అవకాశం.
2026-03-20 11:09:41
కువైట్‌లో ఆయిల్ రిఫైనరీ మూసివేత..
- కువైట్‌లో మరో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి.
- ఇరాన్ దాడిలో కువైట్ ఆయిల్ రిఫైనరీ ధ్వంసం.
- ఆయిల్ రిఫైనరీని మూసివేసిన కువైట్ అధికారులు.
2026-03-20 10:30:09
అమెరికా విమానాన్ని టార్గెట్ చేసిన ఇరాన్
- అమెరికా విమానాన్ని టార్గెట్ చేసిన ఇరాన్
- అమెరికా విమానాన్ని టార్గెట్ చేశామన్న ఐఆర్‌జీసీ
- ఎఫ్-35 ఫైటర్ జెట్ కూలిపోలేదంటున్న అమెరికా.
- ఎయిర్‌బేస్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్టు అమెరికా ప్రకటన.
- పైలట్ కూడా సేఫ్‌గా ఉన్నాడన్న యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి
2026-03-20 09:12:34
12 దేశాల కీలక సమావేశం
- 12 దేశాల కీలక సమావేశం
- వార్ పరిస్థితులపై 12 దేశాల కీలక సమావేశం
- ఇక విశ్వరూపమే అంటున్న ఇరాన్
- ఈసారి పూర్తి నాశనమే అని హెచ్చరిక
- 21వ రోజుకు చేరిన యుద్ధం.
- యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగించే ఉద్దేశం లేదన్న ట్రంప్
- దాడులు నిలివివేస్తామన్న నెతన్యాహు.
2026-03-20 09:07:36
సౌదీ గగనతలంలో డ్రోన్ల కలకలం..
- సౌదీ గగనతలంలో డ్రోన్ల కలకలం..
- 36 డ్రోన్లు, మూడు క్షిపణులను అడ్డుకున్న రియాద్.
2026-03-20 08:48:52
యుద్దంలో మరో కీలక అంకం..
- యుద్దంలో మరో కీలక అంకం..
- టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు.
- ఇజ్రాయెల్ చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ క్షిపణుల వర్షం.
- ప్రపంచాన్ని వణికిస్తున్న చమురు ధరలు.
- బ్యారెల్ 119 డాలర్లు తాకి మళ్లీ తగ్గుముఖం.
2026-03-20 08:48:52
యుద్ధంలో కొత్త మలుపు
- పశ్చిమాసియా యుద్ధంలో కొత్త మలుపు
- ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు.
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. హైఫాలో అగ్ని ప్రమాదం
- సౌదీ గగనతలంలోకి డ్రోన్ల చొరబాటు.. అడ్డుకున్న డిఫెన్స్.
- ఎస్కలేషన్ డామినెన్స్ కోసం ఇరు దేశాల పోటాపోటీ దాడులు.
2026-03-20 08:48:52
పొరుగు దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయ్ వ్యాఖ్యలు
- మాపై దాడికి అనుమతించొద్దు.. ఇరాన్ హెచ్చరిక
- అమెరికా స్థావరాల నుంచి మాపై దాడికి అనుమతించవద్దు.
- మాపై దాడి చేయకుండా ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలను నిలువరించాలి.
- అమెరికా సైనిక స్థావరాలే ప్రస్తుత సంక్షోభానికి మూలకారణం
- ఇరాన్‌పై జరుగుతున్న దాడులకు ఈ స్థావరాలే కేంద్ర బిందువులు
2026-03-20 08:10:48
ఇరాన్ భారీ దాడులు...
- రస్ లఫాన్ క్షేత్రంపై ఇరాన్ దాడులు
- మంటల్లో ఖతార్ ఎల్‌ఎన్‌జీ క్షేత్రం
- 17 శాతం ఉత్పత్తి కేంద్రాలు బుగ్గి?
- భారీ నష్టం, కోలుకునేందుకు ఐదేళ్లు!
- రూ. 2.4 లక్షల కోట్లు అవసరం!
- అక్కడినుంచే మనకు ఎల్‌ఎన్‌జీ
- సౌదీ అరాంకోపైనా ఇరాన్ దాడులు
- కువైట్, అబుదాబి క్షేత్రాలపైకీ డ్రోన్లు
- వాటిని నాశనం చేస్తామని హెచ్చరిక
- అప్పుడు సౌత్ పార్స్ క్షేత్రం బుగ్గే!
- ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం
- యుద్ధరంగంలోకి సౌదీ అరేబియా?
2026-03-20 07:30:19
Advertisement


