Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu, Pawan Kalyan By Vardhelli Murali1
రెండు కోహినూర్‌ కథలు!

నలభై యాభయ్యేళ్ల కిందటి దాకా తెలుగు నాటకరంగం బతికే ఉండేది. సినిమా, టీవీలు దాన్ని పూర్తిగా మింగేయకముందు నాటి సంగతి. 1970లలో సాంఘిక ఇతివృత్తంతో కూడిన నాట కాలు, నాటికలను విరివిగా ప్రదర్శించేవాళ్లు. ఆ రోజుల్లో వచ్చిన ఒక నాటిక పేరు ‘కోహినూర్‌ కావాలి’. రాజకీయాలపై అదొక సెటైర్‌. ఒక రాజకీయ నిరుద్యోగి తన గుర్తింపు కోసం చేసే ప్రయత్నం. కథ సరిగ్గా గుర్తులేదు కానీ, సింగిల్‌ లైన్‌లో దాని సారాంశాన్ని చెప్చొచ్చు. సదరు నిరుద్యోగి బాగా ఆలోచించి లండన్‌లో ఉన్న కోహినూర్‌ వజ్రాన్ని తీసుకురావాలని విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమం చేస్తాడు. కోహినూర్‌ రాదు కానీ, ఆ నిరుద్యోగి కోరిక మాత్రం తీరుతుంది. విద్యార్థులు పావులుగా మిగిలిపోతారు.ఇప్పుడున్న మన రాజకీయ నాయకులకు ఇటువంటి సెటైర్లను పేల్చకుండా రోజులు గడవని పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని మన అగ్ర నాయకులు ఈ వారం తాజాగా పేల్చిన ఓ రెండు సెటైర్లను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సీనియర్‌ మోస్ట్‌ నాయకుడైన చంద్రబాబు వంతు. ఆయన తనకు ప్రీతిపాత్రమైన సింగపూర్‌ యాత్రకు శనివారం బయల్దేరారు. అమరావతి స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ కోసం మరోసారి సింగపూర్‌ను ఒప్పించడం ఆయన ఉద్దేశం. తప్పేమీ లేదు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లాడనుకోవచ్చు. కానీ, ఆయనకో డౌటు కూడా ఉన్నది. ఈసారి సింగపూర్‌ వాళ్లు ఒప్పుకుంటారో లేదోననే గుంజాటన వ్యక్తం చేశారు. కుదరక పోతే, ‘‘... అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడనే’’ సామెత మనకు ఉండనే ఉన్నది.సింగపూర్‌ స్పందనపై ఆయన అనుమానానికి చెప్పిన కారణమే ఒక పెద్ద బుకాయింపు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదిరిన స్టార్టప్‌ ఏరియా ఒప్పందాన్ని జగన్‌ సర్కార్‌ రద్దు చేయడమే గాక వారిని వేధించడం వల్లనే వెనకాడు తున్నారని చంద్రబాబు చెప్పారు. కానీ అసలు సంగతి దాచేస్తే దాగేది కాదు. అప్పటి స్టార్టప్‌ ఏరియా ఒప్పందంలో సింగపూర్‌ తరఫున మంత్రి ఈశ్వరన్‌ కీలక భూమిక పోషించారు. ఆయనతో చంద్రబాబుకు చిరకాల స్నేహముందనేది బహిరంగ రహస్యం. అవినీతి ఆరోపణలపై ఈశ్వరన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించడమే గాకుండా సింగపూర్‌ ప్రభుత్వం ఆయనను జైలుకు కూడా పంపించింది. ఈమధ్యనే ఆయన విడుదలయ్యారు. అమరావతి స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో భాగస్వామ్యం పట్ల సింగపూర్‌కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈశ్వరన్‌ పాత్ర కారణంగా ఉండాలి.ముందుగానే మధ్యవర్తుల ద్వారా ఒక అవగాహన కుదరకుండా ఏ ప్రభుత్వాధినేతా విదేశాలకు వెళ్లి బేరం మొదలు పెట్టడు. చేతి నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్రాండ్‌ వాడుకునేందుకు భాగస్వామిగా ఉండి వేలకోట్లు సంపా దించే అవకాశాన్ని సింగపూర్‌ వాళ్లు కాదనకపోవచ్చు. ఇంతకు ముందు కుదిరిన స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ఒప్పందాన్ని పరిశీ లిస్తే దాని లోగుట్టు బోధపడుతుంది. ఒకవేళ ముందస్తు అవగాహనంటూ ఏదీ లేకపోతే ఆయన పర్యటన అసలు కారణం ఇంకేదైనా ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాధినేత కనుక సింగపూర్‌ ప్రభుత్వ పెద్దలతో మర్యాద పూర్వక భేటీలు జరగవచ్చు. జగన్‌ నిర్వాకం కారణంగా భాగస్వామ్యానికి వాళ్లు ఒప్పు కోలేదని వచ్చిన తర్వాత బురద చల్లవచ్చు. ముందస్తు అవగా హన ప్రకారమే ఒప్పందం కుదిరితే చంద్రబాబు వెళ్లాడు గనుక వాళ్లు దిగొచ్చారని, సింగపూర్‌ బ్రాండ్‌ మనకు కోహినూర్‌ డైమండ్‌ కంటే విలువైనదని భాజా మోగించుకోవచ్చు. ఇలా ఉభయతారకంగా ఉండాలనే జగన్‌పై ఓ కామెంట్‌ విసిరి ఆయన సింగపూర్‌ వెళ్ళారు.గతంలో కుదిరిన స్టార్టప్‌ ఒప్పందం ఒక దోపిడీ పథకమని దాన్ని పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రాజధాని ప్రాంతం కోర్‌ ఏరియాలో 1,691 ఎకరాల భూమిని సింగపూర్‌ కంపెనీల కన్సార్టియానికి అప్పగించారు. వారితో నామమాత్రపు భాగ స్వామిగా కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ కంపెనీ (సీసీడీఎంసీ) ఉంటుంది. ఈ భాగస్వాములతో కలిసి ‘అమరావతి డెవలప్‌ మెంట్‌ పార్ట్ట్‌నర్స్‌’ పేరుతో వ్యవహారం నడుపుతారు. ఈ భూమిలో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్‌ కన్సార్టియానికి బహుమతిగా లభిస్తుంది. ఇక మిగిలిన 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌తో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడమే కన్సార్టియం పని. అభివృద్ధి చేయడానికయ్యే 5,500 కోట్ల రూపాయల ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. స్నేహితుడైన ఈశ్వరన్‌ నేతృత్వంలో వచ్చిన సింగపూర్‌ కన్సార్టియానికి ఇలా దోచిపెట్టే ఒప్పందాన్ని స్కామ్‌ అనకుండా ఉండగలమా? గతంలో కూడా సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందమని ప్రచారం చేశారు కానీ, జరిగింది మాత్రం కంపెనీలతోనే! ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.ఇక రెండో కోహినూర్‌ కథలో నిజంగానే కోహినూర్‌ డైమండ్‌ వృత్తాంతం ఇమిడి ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన వ్యవహారం. ప్రాథమికంగా పవన్‌ కల్యాణ్‌ సినిమా నటుడు. కేవలం నటుడు అంటే సరిపోదు. పుష్కలంగా అభిమానగణం ఉన్న పాపులర్‌ హీరో. ఆయన కొత్త సినిమా హరిహర వీరమల్లు మొన్ననే విడుదలైంది. విడుదలతోపాటు వివాదాలను కూడా మోసుకొచ్చింది. రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్లు సినిమాల్లో నటించకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి ఆయన నటించడం మీద పేచీ ఏమీ లేదు. కాకపోతే ఉన్నతమైన ప్రభుత్వ బాధ్యతలో ఉన్న వ్యక్తి కనుక తను నటిస్తున్న సినిమా ఇతివృత్తం విషయంలోనూ, ఆ సినిమా విడుదలకు సంబంధించిన ఇతరత్రా విషయాల్లోనూ ఆదర్శంగా ఉంటారని ఎవరైనా ఆశిస్తారు.విడుదలైన తొలి వారం పది రోజుల్లో టికెట్‌ రేట్లు పెంచుకునే విషయంపై గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఫిలిం ఛాంబర్‌ ద్వారా మాత్రమే ఏ సినిమా నిర్మాతైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని, తన సినిమాలకైనా ఇది వర్తిస్తుందని కొద్దికాలం కిందనే పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. కానీ కేవలం నిర్మాత విజ్ఞప్తి మేరకే టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంత చిన్న విషయంపై కూడా పవన్‌ తన మాట మీద నిలబడలేకపోయారు. విడుదలకు ముందురోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. మొఘల్‌ కాలంలో జరిగిన అక్రమాల గురించి మన చరిత్రలో చెప్పలేదనీ, విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి కూడా చెప్పలేదనీ ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా సత్యదూరం.విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంతో పోలుస్తూ కావల్సినన్ని చరిత్ర వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణదేవరాయల దండయాత్రల గురించీ, ఆయన కళా సాహితీ రంగాల పోషణ గురించీ, సాహితీ సమరాంగణాన చక్రవర్తిగా ఆయన వాసికెక్కడం గురించీ బోలెడన్ని కథలూ, గాథలూ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చరిత్ర పాఠాల్లో కూడా ఉన్నాయి. విజయనగర వీధుల్లో రతనాలను రాశులుగా పోసి అమ్మేవారని కూడా చదువుకున్నాము. అశోకుడు చెట్లు నాటించెను, బాటలు వేయించెను, బావులు తవ్వించెను అనే పాఠం చదవకుండా ఎవరైనా ప్రాథమిక విద్యను పూర్తి చేస్తారా? ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం తనకంటే పెద్ద వాడైన దారా షికోను హత్య చేయించాడని, తండ్రిని చెరసాలలో పెట్టించాడనే అంశాలు కూడా మన చరిత్రలో లేవని పవన్‌ ఆరోపణ. అది కూడా నిజం కాదు. ఆ సాహిత్యం పుష్కలంగా అందుబాటులో ఉన్నది.కోహినూర్‌ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. కృష్ణా తీరంలో లభించిందని ప్రతీతి. అక్కడినుంచి కాకతీయల రాజధాని ఓరుగల్లుకు, అల్లా వుద్దీన్‌ ఖిల్జీ ద్వారా ఢిల్లీకి, నాదిర్‌షా ద్వారా పర్షియాకు, మహా రాజా రంజిత్‌సింగ్‌ వశమై లాహోర్‌కు, అక్కడి నుంచి బ్రిటిష్‌ వారితో లండన్‌కు ప్రయాణం చేసిన వజ్ర రాజం. ఆరొందల సంవత్సరాల ట్రావెలాగ్‌ కోహినూర్‌ది. అట్లాగే ఔరంగజేబు. 17వ శతాబ్దంలో భారతదేశాన్ని శాసించిన మొఘల్‌ చక్రవర్తి. ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీశారట! ఈ కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడ నేది సినిమా కథగా చెబుతున్నారు. చారిత్రకాంశాలతో ఫాంట సీలు తీయొద్దని ఎవరూ చెప్పలేరు. సృజనాత్మక కళలపై ఆంక్షలు పెట్టడం, లక్ష్మణ రేఖలు గీయడం కూడా వాంఛనీయం కాదు. కాకపోతే ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడాన్ని, ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ఉద్దేశించడాన్ని మాత్రం సహించలేము.తనది సనాతన ధర్మ పథమని ఈమధ్యనే పవన్‌ కల్యాణ్‌ ప్రకటించుకున్న విషయం విదితమే. తన ధర్మపథ ప్రచారానికి తద్వారా తన రాజకీయ భవిష్యత్‌ ఉన్నతికి దోహదపడే ప్రచార చిత్రంగా దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన భావించి ఉండ వచ్చు. ఈ కారణంగా కొంత భాగాన్ని డైరెక్ట్‌ చేసిన క్రిష్‌ అర్ధంతరంగా తప్పుకున్నారనే ప్రచారం కూడా ఉన్నది. అదెంతవరకు వాస్తవమో తెలియదు. ప్రచార చిత్రంగా వాడుకున్నా ఫరవా లేదు. కానీ, మొఘల్‌ చక్రవర్తుల కాలంలో అన్నీ అక్రమాలు, అకృత్యాలే జరిగాయా? ఇంకే గొప్పతనం లేదా?... వివిధ చారిత్రక దశల్లో ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై అధ్యయనం చేసిన నిపుణుల సమాచారం ప్రకారం క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్నది. కొద్ది తేడాతో చైనా తర్వాత రెండో స్థానం. భారత ఉపఖండంలో విశాల భూభాగాన్ని ఐక్యం చేసి శాంతి, సుస్థిరతలను సాధించినందు వలన అక్బర్‌ చక్రవర్తి కాలంలో వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెంది, బ్రిటిష్‌ వలస దోపిడీ మొదలయ్యేంతవరకూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నది.అశోక చక్రవర్తి కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ,శాంతి – సుస్థిరత స్థాపనల ఫలితంగా, ఆ కాలంలో విరాజిల్లిన బౌద్ధమతం వెలుగులో వ్యవసాయ వాణిజ్యాలతోపాటు శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో కూడా ముందంజ వేసింది. అనంతర కాలంలో రెండు మూడు శతాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 35 శాతం వాటాను సొంతం చేసుకొని ఆర్థిక సూపర్‌ పవర్‌గా వెలుగొందిందని అంచనా వేశారు. అశోకా ది గ్రేట్, అక్బర్‌ ది గ్రేట్‌ అని ఊరికే అనలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారత నేత పనివాళ్ల వేళ్లను విరగ్గొట్టిందీ, భారత వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందీ, భారతదేశ సంపదను కొల్ల గొట్టి తమ దేశానికి తరలించుకుపోయిందీ బ్రిటిష్‌వాళ్లే కాని, మొఘల్స్‌ కాదు. బాబర్‌ సెంట్రల్‌ ఏసియా నుంచి వచ్చి ఉండ వచ్చు. అనంతర మొఘల్సందరూ ఇక్కడే పుట్టారు. ఇక్కడే చనిపోయారు. ఈ దేశ చరిత్ర మీద తాజ్‌మహల్‌ వంటి సంత కాలను చేశారు. బ్రిటిష్‌ వలసదారులకు వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించింది ఆఖరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ కాదా? బ్రిటిష్‌ వాళ్ళు ఆయన్ను పట్టుకొని బర్మాలో ప్రవాస ఖైదు విధిస్తే, తాను చని పోయాక తన జన్మభూమి భారత్‌లో అంత్యక్రియలు చేయాలని చివరి రోజుల్లో ఆయన కోరుకున్న విషయం చరిత్రే కదా! బాధ్యత గల వ్యక్తులు చారిత్రకాంశాలతో కూడిన సినిమాలు తీసినప్పుడు ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసు కోవడం అవసరం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Weekly Horoscope In Telugu From 27-07-2025 To 02-08-20252
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువుల సలహాలు, సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. ఐటీరంగం, కళాకారులు, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత గులాబీ రంగులు. . దుర్గాస్తోత్రాలు పఠించండి.వృషభం....కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. వైద్యరంగం, క్రీడారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, లేత ఆకుపచ్చరంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.మిథునం...ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగానే సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. ఐటీ రంగం, పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. తెలుపు, గులాబీ రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.కర్కాటకం...కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. కâ¶ లు, ఐటీ రంగం, రాజకీయవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.సింహం...రాబడి సంతృప్తినిస్తుంది. రావలసిన పైకం కూడా అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఉపశమనం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీసత్తా చాటుకునేందుకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. క్రీరాకారులు, వైద్యరంగం, పారిశ్రామికవర్గాలకు అనుకూల పరిస్థితి ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కన్య...ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ద్వారా శుభవార్తలు అందుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగల అవకాశం. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు, . శివాష్టకం పఠించండి.తుల...వ్యూహ ప్రతివ్యూహాలలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలు, దైవకార్యాల నిర్వహణపై చర్చలు ఫలిస్తాయి. కొత్త గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. శాస్రవేత్తలు, పత్రికారంగం, రాజకీయవర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...ఏ పని చేపట్టినా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వేడుకలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. వైద్య, కళారంగం, క్రీకాకారులకు.శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం. లేత నీలం, పసుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సు...రాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలు, వైద్యరంగం వారికి ప్రయత్నాలు సఫలం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.మకరం...మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. క్రమేపీ మీకు ఎదురులేని పరిస్థితి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థులకు అనుకూలత. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. ఐటీ రంగం, కళాకారులు, రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు.. దేవీఖడ్గమాల పఠించండి.కుంభం...కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని పట్టుదల, ఆత్మస్థైర్యమే విజయాల వైపు నడిపిస్తాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు మీదపడతాయి. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుపుతారు. క్రీడాకారులు, పరిశోధకులు, వ్యవసాయరంగాల వారి ఆశలు ఫలించే సమయం. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు, విష్ణుధ్యానం చేయండి.మీనం...కొన్ని కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. శ్రేయోభిలాషుల నుంచి కొంత సహాయం సైతం అందుతుంది. ఊహలు నిజం కాగలవు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిత్రవిచిత్ర విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం,, అనుకూల ఫలితాలు సాధిస్తారు. రియల్‌ ఎస్టేట్‌వర్గాలకు శుభసూచకాలే. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. క్రీడాకారులు, రాజకీయవేత్తలు, వైద్యరంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నేరేడు, తెలుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.

Chandrababu Coalition Govt Lands Scam in Visakha3
రూ.3,000 కోట్ల దోపిడీ

ఏ రంగమైనా సరే.. ఏ ప్రాజెక్టు అయినా సరే.. ‘నీకింత–నాకింత’ సిద్ధాంతాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాజధానిలో భూ పందేరాలు, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు కట్టబెట్టడంలో చోటుచేసుకున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుండగానే పెద్దల దృష్టి విశాఖపై పడింది. ఐటీ ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలను రంగంలోకి దించింది. ఐటీ పార్కులంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టి పక్కా కమర్షియల్‌ సంస్థలకు అత్యంత విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టడంపై అధికార వర్గాలు నివ్వెర పోతున్నాయి. ఈ 60 ఎకరాల మీదే ఆయా సంస్థలకు ఏటా రూ.1,000 కోట్ల మేర అద్దెలు వస్తాయంటే ఎవరి వాటా ఎంతుంటుందోనని చర్చించుకుంటున్నారు. సాక్షి, అమరావతి: సత్వా, కపిల్‌ గ్రూపు, ఏఎన్‌ఎస్‌ఆర్‌.. ఎంత ఖరీదైన భూములనైనా కొనడానికి వెనుకాడని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు. బెంగళూరు, పూణే, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ కంపెనీలు భారీగా లగ్జరీ గృహ, వాణిజ్య సముదాయాలు నిర్మించి కోట్ల రూపాయల టర్నోవర్‌ చేస్తున్నాయి. వేలం పాటలో అధిక ధరలకు భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేస్తూ లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి పక్కా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ముసుగులో ఖరీదైన భూములను కారు చౌకగా కట్టబెడుతూ విశాఖలో అసలుసిసలైన ‘రియల్‌’ దందాకు తెరలేపింది. బహిరంగ మార్కెట్‌లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూములను ఆ సంస్థలకు కట్టబెట్టడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అందుకే ఎటువంటి వేలం లేకుండానే వేల కోట్లు విలువ చేసే భూములను పరిశ్రమల ఆకర్షణ పేరుతో ప్రభుత్వం ధారాదత్తం చేసింది. బెంగళూరుకు చెందిన సత్వా గ్రూపు, తెలుగు రాష్ట్రాలో చిట్‌ ఫండ్‌ వ్యాపారంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించే కపిల్‌ గ్రూపు, ఏఎన్‌ఎస్‌ఆర్‌ వంటి సంస్థలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన భూమిని పప్పు బెల్లాల్లా అతి తక్కువ ధరకే పంచి పెట్టింది. ఈ ప్రాజెక్టుల్లో ఎటువంటి ప్రభుత్వ వాటా లేకుండా భూములను కట్టబెట్టడం విస్మయపరుస్తోంది. సత్వా, కపిల్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు 60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాల ద్వారా ప్రతి నెలా అద్దెల రూపంలో రూ.80 కోట్లు.. ఏటా దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయం పొందుతాయని అంచనా. ఇప్పటికే ఉర్సా వంటి అనామక కంపెనీలకు భూములు కట్టబెట్టి విమర్శల పాలైనప్పటికీ భూ కేటాయింపుల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. భవనాలు నిర్మించి కోట్లల్లో అద్దెలు ముక్కుపిండి వసూలు చేసే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ప్రభుత్వం ఇలా కారుచౌకగా భూములు కేటాయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ సంస్థకు మాత్రం అధిక ధర⇒ ఇదే కొండపై ఫీనమ్‌ పీపుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే ఐటీ కంపెనీకి ఎకరా రూ.4.5 కోట్లు చొప్పున కేటాయించడం గమ­నార్హం. ఐటీ కంపెనీకి అధిక ధరకు కేటాయించి,రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చౌకగా కేటాయించడం భూ కేటాయింపుల్లో ‘రియల్‌’ మోసా­లను బహిర్గతం చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ⇒ సత్వా గ్రూపునకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో భూమిని కేటాయించడమే కాకుండా ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 కింద పెట్టుబడి రాయితీ, విద్యుత్‌ సబ్సిడీ, ఎస్‌జీఎస్టీ మినహాయింపు తదితర అనేక అదనపు రాయితీలను కూడా ఇవ్వనుంది. సత్వా డెవలపర్స్‌ ఎటువంటి ఐటీ కంపెనీలను పెట్టదని.. కేవలం ఐటీ పార్కును అభివృద్ధి చేసి ఇతర ఐటీ కంపెనీలకు లీజుకు ఇస్తుందని, అలాంటప్పుడు ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ కింద రాయితీలను ఎలా ఇస్తారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ⇒ సత్వా డెవలపర్స్‌ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారని, వాస్తవానికి ఇక్కడ సత్వా డెవలపర్స్‌ ఎవరికీ నేరుగా ఉపాధి కల్పించదని, ఈ వెంచర్‌లో ఏర్పాటు చేసే ఇతర ఐటీ కంపెనీలు మాత్రమే ఉపాధి కల్పిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ⇒ ఈ నేపథ్యంలో ఉపాధి కల్పన పేరుతో భారీగా రాయితీలను సత్వాకు దోచి పెట్టారని ఇట్టే తెలుస్తోంది. సత్వాకు రాయితీలు ఇచ్చి, ఇప్పుడు అందులో పెట్టే ఐటీ కంపెనీలకు కూడా రాయితీలు ఇస్తే ఒకే ప్రాజెక్టుపై రెండుసార్లు రాయితీలు ఏ విధంగా ఇస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు.అప్పనంగా విలువైన భూములు⇒ తెలుగు రాష్ట్రాల్లో చిట్‌ఫండ్, రియల్‌ ఎస్టేట్, మీడియా రంగాల్లో విస్తరించి ఉన్న కపిల్‌ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలోని పనోరమ హిల్స్‌ వెనుక ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున 30 ఎకరాలు కేటాయించింది. ఎండాడ వద్ద బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.100 కోట్లు పెట్టినా భూమి దొరకని పరిస్థితి. అంటే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూమిని హెచ్‌ఎంటీవీ వంటి మీడియా సంస్థలు కలిగిన కపిల్‌ గ్రూపునకు కేవలం రూ.45 కోట్లకే 30 ఎకరాలను కేటాయించింది. కపిల్‌ గ్రూపు విశాఖలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ అలాగే వెంచర్‌ ఫండ్స్‌ నుంచి నిధులు సేకరించి ఐటీ పార్కులు.. ముఖ్యంగా గ్లోబల్‌ క్యాపబుల్టీ సెంటర్స్‌ (జీసీసీ)ను ఆకర్షించే బెంగళూరుకు చెందిన ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌కు మధురవాడ ఐటి హిల్‌ నెంబర్‌ 3పై ప్లాట్‌ నంబర్‌ 6 వద్ద 2.5 ఎకరాలు.. హిల్‌ నంబర్‌ 4పై ప్లాట్‌ నంబర్‌ యూడీఎల్‌ 6 వద్ద 7.79 ఎకరాల (మొత్తం 10.29 ఎకరాలు) భూమిని కారుచౌకగా కేటాయించింది. ఏఎన్‌ఎస్‌ఆర్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉపాధి కల్పించనుంది. ⇒ ఐటీ పార్క్‌ల అభివృద్ధికి ఏపీఐఐసీ ఉండగా, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు అప్పగించడం ఏమిటని అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం ఐటీ ముసుగులో రియల్‌ కంపెనీలకు కారు చౌకగా భూములను ఎలా ఇస్తుందని, అదీ వేలం వేయకుండా ఇవ్వడం దారుణం అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.1,500 కోట్ల భూమి సత్వాకు రూ.45 కోట్లకే ⇒ సత్వా గ్రూపు.. రెండు దశాబ్ధాలుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉంది. పుణే, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో భారీ లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసింది. బ్లాక్‌ స్టోన్‌ వంటి పీఈ, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల నుంచి నిధులు సేకరించి వ్యాపారం చేస్తోంది. 2017లో సత్వా గ్రూపు హైటెక్‌ సిటీ వద్ద 10 ఎకరాల స్థలాన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు తాజాగా కోకాపేట వద్ద 25 ఎకరాల భూమిని రూ.వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ⇒ ఇలా ప్రైవేటుగా స్థలాలు కొనుగోలు చేసి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే సంస్థను జూలైలో బెంగళూరు పర్యటనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కలిశారు. గంటల వ్యవధిలో విశాఖలో పెట్టుబడుల ఒప్పందానికి సత్వాను ఒప్పించినట్లు సోషల్‌ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. జూలై 8న నారా లోకేశ్‌ కలవడం.. గంటలోనే విశాఖలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పించినట్లు ప్రకటించుకోవడం.. జూలై 23న ఎస్‌ఐపీబీ (స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌)లో ఆమోదం పొందడం, ఆ మర్నాడే (జూలై 24) విశాఖలో 30 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రి మండలిలో ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయింది. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూమిని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సత్వా డెవలపర్స్‌కు ఇలా అప్పగించేశారు. ⇒ విశాఖ గ్రామీణ మండలం మధురవాడ ఐటీ హిల్‌ నంబర్‌ 4 పై ప్లాట్‌ నంబర్లు యూడీఎల్‌ 1, యూడీఎల్‌ 2, యూడీఎల్‌ 3 వద్ద 30 ఎకరాల భూమిని సబ్సిడీ ధరగా ఎకరా రూ.1.5 కోట్లకే కేటాయిస్తూ కేబినెట్‌ తీర్మానం చేసింది. ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్స్‌లో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. అంటే రూ.1,500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.45 కోట్లకే ఈ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి అప్పగించడంపై అధికారులు నివ్వెరపోతున్నారు.

KL Rahul, Shubman Gill lead rescue after ben Stokes ton leads England to 6694
ఇంగ్లండ్‌కు టీమిండియా స‌వాల్‌ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది?

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్టు ఆస‌క్తిక‌రంగా మారింది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవ‌కుండానే రెండు వికెట్లు కోల్పోయి భార‌త్‌ క‌ష్టాల్లో ప‌డింది.ఈ స‌మ‌యంలో జ‌ట్టును కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌(167 బంతుల్లో 78 బ్యాటింగ్‌), కేఎల్‌ రాహుల్‌ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌల‌ర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ రెండు వికెట్లు న‌ష్టానికి 174 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం గిల్ సేన 137 పరుగులు వెనుకంజలో ఉంది.టీమిండియా సవాల్ విసురుతుందా?కాగా మాంచెస్టర్ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలూండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందా? లేదా డ్రా ముగిస్తుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆఖరి రోజు ఆటలో తొలి సెషన్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.ఇంగ్లండ్‌కు టార్గెట్ నిర్దేశించాలని భారత జట్టు భావిస్తే కచ్చితంగా మొదటి సెషన్‌లో వికెట్లు ఏమీ కోల్పోకుండా కాస్త దూకుడుగా ఆడాలి. ఇంగ్లండ్‌కు 200 పైగా టార్గెట్ ఇవ్వాలన్న టీమిండియా ఖచ్చితంగా టీ బ్రేక్ వరకు అయినా బ్యాటింగ్ చేయాలి. అంటే వన్డే తరహాలో తమ బ్యాటింగ్‌ను కొనసాగించాలి.ఒకవేళ తొలి సెషన్‌లో టీమిండియా వికెట్లు కోల్పోతే డ్రా కోసం వెళ్తే బెటర్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చినా, క్రీజులో నిలదొక్కకుంటాడో లేదా అన్నది ప్రశ్నార్ధంగా మారింది.అతడు కాలి పాదం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పంత్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లకు వెళ్లే అవకాశముంది. ఆ ప్రయత్నంతో పంత్ వికెట్ కోల్పోయిన ఆశ్చర్యపోన్కర్లలేదు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ప్రతిఘటించే అవకాశమున్నప్పటికి, వాషింగ్టన్ సుందర్‌, శార్ధూల్ ఠాకూర్ ఎప్పుడూ ఎలా ఆడుతారో చెప్పలేం. కాబట్టి టీమిండియా మొత్తం ఆశలన్నీ క్రీజులో ఉన్న శుబ్‌మన్ గిల్‌, రాహుల్‌పైనే ఉన్నాయి. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ వీలైనంత త్వరగా భారత్‌ను ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.చదవండి: కివీస్‌దే ముక్కోణపు టోర్నీ

Chirag Paswan Slams Nda Ally Nitish Kumar Govt5
ఎన్నికల వేళ బీహార్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. నితీశ్‌కు చిరాగ్‌ పాశ్వాన్‌ ఝలక్‌!

పట్నా/గయా: బీహార్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై ఎన్డీయే భాగస్వామ్య పక్షం ఎల్‌జేపీ(రాం విలాస్‌) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యథేచ్ఛగా కొనసాగుతున్న నేరాలను ఆపలేని నితీశ్‌ ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరాలను అడ్డుకోవడంలో విఫలమైన సర్కారు వాటిని దాచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.శనివారం గయాలో జరిగిన పార్టీ ర్యాలీలో ప్రసంగం సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న గ్యాంగ్‌ రేప్‌ ఘటనను ప్రస్తావిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్ట్‌ చేసినప్పటికీ, ఇటువంటి ఘోరాలను నివారించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయిందన్నారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. పోలీసు యంత్రాంగం నేరగాళ్లకు దాసోహమంటోందని విమర్శించారు. అదేవిధంగా, తనను బాంబులతో చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ మరోమారు చిరాగ్‌ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని, ప్రభుత్వం మేలుకోవాల్సిన సమయం వచ్చందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తా..ఎన్నికలయ్యాక ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ‘బీహార్‌ ఫస్ట్‌–బీహారీ ఫస్ట్‌’ లక్ష్యంతో పనిచేస్తుందని, నేరగాళ్లను కటకటాల్లోకి నెడుతుందని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా బిహార్‌ ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేసినందుకు ఢిల్లీలో ఉంటే తన లక్ష్యం నెరవేరదని తెలుసుకున్నానని చెప్పారు. అందుకే, కేంద్ర రాజకీయాలను వదిలి రాష్ట్రానికి రావాలనుకుంటున్నానని, ఈ విషయంలో తుది నిర్ణయం పార్టీయే తీసుకుంటుందని చిరాగ్‌ తెలిపారు.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నూటికి నూరు శాతం ఫలితాలను సాధించిందని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తున్నామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేస్తానంటూ ప్రకటించిన చిరాగ్‌.. తనకు సీఎం కుర్చీపై ఎటువంటి మోజు లేదని ఇప్పటికే చెప్పారు. ప్రతిపక్ష ఆర్జేడీపైనా ఆయన విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేరగాళ్లను పోషిస్తూ విభజన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ముస్లింల ఓట్లు తమవేనంటూ ఆర్జేడీ గొప్పగా చెప్పుకుంటోందని, తమ పారీ్టకి కూడా సొంత ఓటు బ్యాంకు ఉందని చిరాగ్‌ అన్నారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేలో విభేదాలు ముదురుతున్నాయనేందుకు చిరాగ్‌ వ్యాఖ్యలను ఉదాహరణగా చెబుతున్నారు.

Upcoming Patriotic Movies updates6
మేరా భారత్‌ మహాన్‌.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్‌ హీరోలు

దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్‌ మహాన్‌’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం.ప్రభాస్‌ ఫౌజి వెండితెరపై ప్రభాస్‌ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్‌ సన్నివేశాల్లో ప్రభాస్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు సూపర్‌గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్‌ కొత్తగా మేకోవర్‌ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్‌ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్‌లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘డ్రాగన్‌’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్‌ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్‌పై కనిపించే సమయంలో సూపర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బస్రూర్‌. దీంతో ఈ ‘డ్రాగన్‌’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్‌ విలన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్‌ 25న విడుదల కానుంది.బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌ ‘టైగర్‌ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్‌ 3’ వంటి స్పై యాక్షన్‌ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఆఫీసర్‌గా నటించి, మెప్పించారు సల్మాన్‌ ఖాన్‌. తాజాగా ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ ఆర్మీ ఆఫీసర్‌పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్‌ లోయలో భారత్‌–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్‌ మరో లీడ్‌ రోల్‌ చేయనున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్‌పాత్ర కోసం సల్మాన్‌ ఖాన్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’ సినిమా కోసం లడఖ్‌లో ఓ భారీ షూటింగ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్‌ చేస్తామని, ఈ షెడ్యూల్‌ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల ఈ ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌ చేయాలని సల్మాన్‌ ఖాన్‌ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్‌కు విడుదల చేయాలని సల్మాన్‌ ఆలోచిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. భజరంగీ భాయిజాన్‌ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘భజరంగీ భాయిజాన్‌’ సినిమా మంచి ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్‌’ సినిమాకు సీక్వెల్‌ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్‌ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్‌ ఖాన్‌ పేర్కొన్నారు. కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్‌ షైతాన్‌ సింగ్‌ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్‌ దర్శక–నటుడు ఫర్హాన్‌ అక్తర్‌. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్‌ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్‌లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్‌’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్‌ షైతాన్‌ సింగ్‌గా ఫర్హాన్‌ అక్తర్‌ నటిస్తున్నారు. రజనీష్‌ ఘాయ్‌ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్‌లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్‌ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్‌’ చిత్రంలో ఆడియన్స్‌ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్‌ అక్తర్‌. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్‌ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్‌ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్‌ హీరోగా నటించిన వార్‌ డ్రామా ‘బోర్డర్‌ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్‌ 2’ రానుంది. ‘బోర్డర్‌’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్‌ ఈ ‘బోర్డర్‌ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్‌ ధావన్, అహాన్‌ శెట్టి, దిల్జీత్‌ సింగ్‌ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్‌తోపాటు కశ్మీర్‌లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్‌ ఫిల్మ్‌ ఇది’’ అని చిత్రయూనిట్‌ ఈ ‘బోర్డర్‌ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్‌ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్‌ ప్రకటించింది.ఆపరేషన్‌ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్‌ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్‌లో జరిగిన ఆపరేషన్‌ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్‌ నేషన్స్‌ (ఐక్యరాజ్యసమితి) పీస్‌ కీపింగ్‌ మిషన్స్‌లో భాగంగా వెస్ట్‌ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్‌ ట్రాప్‌లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్‌ను రాజ్‌ పాల్‌ పునియా సక్సెస్‌ఫుల్‌గా లీడ్‌ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్‌ పాల్‌ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్‌ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్‌ ఖుక్రీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ది ఇండియన్‌ ఆర్మీస్‌ బ్రేవెస్ట్‌ పీస్‌ కీపింగ్‌ మిషన్‌ అబ్రాడ్‌’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్‌ జనరల్‌ రాజ్‌ పాల్‌ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్‌ హక్కులను రాహుల్‌ మిత్రా ఫిల్మ్స్, రణ్‌దీప్‌ హుడా ఫిల్మ్స్‌ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్‌ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్‌ రాజ్‌ పాల్‌ పునియాగా రణ్‌దీప్‌ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్‌లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్‌’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్‌ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్‌చరణ్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్‌లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్‌’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్‌ సిందూర్‌ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్‌ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్‌ను రిజిస్టర్‌ చేయించారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్‌ నితిన్‌ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్‌ తాను ప్రకటించిన సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌ హీరోలుగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్‌ డ్రామా సినిమా ‘వార్‌ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. ఇక ‘వార్‌ 2’తోపాటు ‘యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్పై యూనివర్స్‌’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్‌ రావైల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్‌ స్పై డ్రామా ‘సర్దార్‌ 2’. పీఎస్‌ మిత్రన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్‌. లక్ష్మణ్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్‌. విజయ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటీనటులు వామికా, ఇమ్రాన్‌ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.

Kurnool Priest Poojanna Swamy Episode Full Details7
కక్షసాధింపు భరించలేకపోతున్నా.. కర్నూలులో అర్చకుడి ఆత్మహత్య

సాక్షి, మంత్రాలయం: ఆలయ ఈవో విజయరాజు చులకన భావం, ప్రధాన అర్చకుడు జె.ఈరప్ప, వేద పండిట్‌ మోహన్‌శర్మ పెత్తనం భరించలేక ఉప ప్రధాన అర్చకుడు పూజన్న స్వామి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో సంచలనంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉరుకుందకు చెందిన పూజన్న స్వామి 2002లో శ్రీ ఈరన్న స్వామి ఆలయంలో శాశ్వత అర్చకుడిగా నియమితులయ్యారు. వంశపారంపర్య హక్కుతో ఆలయంలో సేవలు అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఉప ప్రధాన అర్చకుడిగా పదోన్నతి పొందారు. వీరి పూర్వీకుల పొలాల్లోనే ఈరన్న స్వామి కొలువుదీరడం గమనార్హం. మూడేళ్ల క్రితం రూ.50 లక్షల విలువైన 4 గదుల సముదాయాన్ని కూడా పూజన్న ఆలయానికి విరాళంగా ఇచ్చారు. శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రించిన పూజన్న స్వామి, ఆదివారం వేకువజామున తన ఇంటి పైగదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఎంతకూ ఆయన లేవకపోవడంతో, కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూడడంతో అప్పటికే ఆయన మృతిచెందినట్టు గుర్తించారు.మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌లో ఆలయ ఈవో విజయరాజుపై, ప్రధాన అర్చకుడు జె.ఈరప్ప, వేద పండిట్‌ మోహన్‌శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన అర్చకుడు, వేద పండిట్‌ కలిసి ఆలయంలోని ఇతర అర్చకులపై అధికారం చెలాయిస్తూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వంశపారంపర్య అర్చకులమన్న గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భాలయంలో సీసీ కెమెరాలు పెట్టి అర్చకులను దురుద్దేశంతో చూస్తున్నారని వాపోయారు. దేవాలయంలో అనేక వాస్తవ విరుద్ధాలు జరుగుతున్నా ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. ఈవో వారిద్దరిని మద్దతు ఇస్తుండడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మృతుడికి భార్య జయమ్మ, కుమార్తెలు శ్రావణి, శ్రీలత, కుమారుడు వీరయోగీంద్ర మణికంఠ ఉన్నారు.నేను చులకనగా చూడలేదు: ఆలయ ఈవో విజయరాజునేను అర్చకులను ఎవ్వరినీ చులకనగా చూడలేదు. శాఖాపరంగా ఆలయంలో తీసుకోవాల్సిన సంస్థాగత మార్పులు మాత్రమే చేశాను. సీసీ కెమెరాలు విషయం శాఖాపరంగా జరిగింది. పూజన్న స్వామి పట్ల ఏనాడూ నేను దురుసుగా ప్రవర్తించలేదు. ఆయన సూసైడ్‌ నోట్‌లో ఎందుకు అలా రాశారో అర్థం కావడం లేదు. ఎవ్వరిపైనా నాకు ప్రత్యేక ద్వేషం లేదు.

China unveils largest crystal for high-powered laser weapons8
భూమి మీద నుంచే శాటిలైట్లపై దాడి! 

ఎల్రక్టానిక్స్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్స్‌సహా ఎన్నో రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతున్న చైనా ఇప్పుడు మరో అసాధారణ, శక్తివంతమైన ఆయుధ తయారీలో తలమునకలైంది. అగ్రరాజ్యం అమెరికాను తలదన్నేలా ఎన్నెన్నో ఆవిష్కరణలు చేసిన చైనా ఇప్పుడు దేశ భద్రత, రక్షణే పరమావధిగా కీలక ఆయుధాన్ని సృష్టిస్తోంది. తమ వైమానిక, అణు స్థావరాలు, వ్యూహాత్మకప్రాంతాల గుట్టుమట్టు చెప్పే విదేశీ, శత్రు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే తునాతునకలు చేసే లేజర్‌ కాంతి ఆయుధాన్ని అభివృద్ధిచేస్తోంది. కాంతి సాధారణ స్థాయిలోకాకుండా ప్రత్యేకమైన స్ఫటికాల గుండా ప్రసరించినప్పుడు మరింత శక్తివంతంగా మారుతుంది. అత్యంత తీక్షణతో ప్రసరిస్తూ ఆ లేజర్‌ కాంతి ఎంతటి కఠినమైన పదార్థాౖన్నైనా సునాయాసంగా కోసేస్తుంది. భవిష్యత్తులో పనికిరాకుండా సర్వనాశనంచేసేస్తుంది. లేజర్‌ కాంతి ఎంతటి శక్తివంతమైందో ఇప్పటికే పరిశ్రమ రంగంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ లేజర్‌ కాంతిని అంతరిక్షంలో చక్కర్లు కొట్టే శత్రుదేశాల ఉపగ్రహాలపైకి చైనా ప్రయోగించనుంది. భూమి నుంచి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే ఉపగ్రహాలను నేలమీద నుంచే గురిచేసి కొట్టడం అంత తేలికైనపని కాదు. అందుకే బేరియం గాలియం సెలినైడ్‌(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్‌ అని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. ఎంత పెద్ద ఇనుపగుండుతో దెబ్బ కొడితే అంతగా బీభత్సం స్థాయికి పెరుగుతుంది. అలాగే బీజీసీఈ క్రిస్టల్‌ నుంచి వెలువడే లేజర్‌ కాంతి సృష్టించే వినాశనం కూడా అంతే భారీ స్థాయిలో ఉంటుంది. సూక్ష్మం నుంచే సర్వనాశనం.. బీజీఈసీతో తయారైన లేజర్‌ కాంతి పుంజం వ్యాసం కేవలం 6 సెంటీమీటర్లు మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక ఖడ్గం అంచుకు ఉండే పదునులాంటిది. కత్తి అంచును ఎంత సానబడితే అంత పదునెక్కుతుంది. అలాగే ఈ స్ఫటికం ఎంత పారదర్శకంగా ఉంటే అందులోంచి వెలువడే లేజర్‌ కాంతి అంత ప్రాణాంతకంగా మారుతుంది. ఇది ఆకాశంలో చాలా కిలోమీటర్ల దూరం వరకు తీవ్రత ఏమాత్రం తగ్గకుండా అదే తీక్షణతతో దూసుకెళ్తుంది. అలా అది ఏకంగా ఉపగ్రహాలను సైతం ముక్కలుగా కోసేస్తుంది. స్వల్పశ్రేణి పరారుణకాంతి పుంజాలను అత్యంత సుదూరమైన లేజర్‌ కాంతి పుంజాలుగా, మారణాయుధాలుగా మార్చేందుకు బీజీఈసీ స్ఫటికం అక్కరకొస్తుంది. ‘‘చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఏకంగా 550 మెగావాట్ల లేజర్‌ కాంతిని ఈ స్ఫటికం ప్రసరింపజేస్తుంది. ఇంతటి తీక్షణత ధాటికి ఎంతటి కఠినమైన మూలకంతో తయారైన ఉపగ్రహ ఉపరితల పొరనైనా ముక్కలవడం ఖాయం. వందల కిలోమీటర్ల ఎత్తు నుంచి తమపై నిఘా పెట్టిన శత్రు ఉపగ్రహాలను ఉన్నచోటులోనే ఉన్నపళంగా నిరీ్వర్యంచేసే శక్తి ఈ క్రిస్టల్‌ పరారుణ కాంతి ఆయుధానికి ఉంది’’అని ప్రొఫెసర్‌ వూ హైక్సిన్‌ అన్నారు. ఈయన సింథటిక్‌ క్రిస్టల్‌ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనాపత్రానికి ముఖ్యరచయితగా వ్యవహరించారు.అత్యంత సురక్షితం, అతి సామర్థ్యం.. ఇంతటి తీక్షణమైన కాంతి పుంజాన్ని వెదజల్లేటప్పుడు ఈ ఆయుధవ్యవస్థ బాగా వేడెక్కుతుంది. అలాంటప్పుడు వేడికి అదే కాలిపోతుంది. అలాంటి పరిస్థితులురాకుండా దీనిని తయారుచేస్తున్నారు. గతంలో అమెరికా అచ్చం ఇలాంటి ప్రయోగమే చేసి చేతులుకాల్చుకుంది. 1997లో అమెరికా నావికాదళం మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ అడ్వాన్స్‌డ్‌ కెమికల్‌ లేజర్‌(మిరాకిల్‌) పేరిట ఒక ప్రయోగంచేసింది. సొంత ఉపగ్రహాన్నే పలుమార్లు పరారుణకాంతితో కరిగించేందుకు ప్రయత్నించి విజయవంతమైంది. కానీ ఆ లేజర్‌బీమ్‌ను వెదజల్లే వ్యవస్థ సైతం కరిగిపోయింది. ఈ పరిస్థితి తలెత్తకుండా చైనా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరియం గాలియం సెలినైడ్‌(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా శాస్త్రవేత్తలే తొలిసారిగా 2010లో అభివృద్ధిచేశారు. వెంటనే దీనిని తమ ఆయుధవ్యవస్థల్లో అమర్చుకునేందుకు పలు దేశాల రక్షణశాఖలు ప్రయత్నించినా అది ఎందుకో సఫలంకాలేదు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Drama of SIT searches at Vicat company9
కోర్టును బురిడీ కొట్టించేందుకే బాబు కుట్ర

సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సోదాల పేరిట మరో ‘సెన్షేషన్‌’కు చంద్రబాబు సర్కారు తెరతీసింది. ఇంతకాలం ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వికాట్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయిన కూటమి ప్రభుత్వం... ఇది అక్రమ కేసేనని స్పష్టమవుతుండడంతో ఇప్పుడు మరో కుట్రకు పాల్ప­డుతోంది. కేసును ‘సెన్సేషన్‌’ చేయడానికి కొత్త డ్రామాను రక్తి కట్టిస్తోంది. ఏకంగా న్యాయస్థానాలనే తప్పుదారి పట్టించేందుకు బరితెగిస్తోంది. ఆ పక్కా పన్నాగంతోనే... బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్టును బురిడీ కొట్టించేందుకు హైదరా­బాద్‌లోని ఆయన కార్యాలయంలో సోదాల పే­రు­తో కొత్త పన్నాగం పన్నుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసేనని సిట్‌ దర్యాప్తు తీరే స్పష్టం చేస్తోంది. టీడీపీ బాస్‌లకు అన్నింట్లోనూ ‘ఎస్‌’ అనే పోలీస్‌ అధికారులతో ఏర్పాటైన సిట్‌ దర్యాప్తులో ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయింది. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు తప్ప సాధించినదేమీ లేదన్నది తేటతెల్లమైంది. ఎల్లో మీడియా ద్వారా సాగిస్తున్న దుష్ప్రచార కుతంత్రమూ బెడిసికొడుతోంది. అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొడుతుండడంతో చంద్రబాబు ప్రభు­త్వం బెంబేలెత్తుతోంది. దీంతో మరో కుతంత్రం రచించింది. బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేసి 75 రోజులైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నెలల పాటు దర్యాప్తు పేరిట రిమాండ్‌లో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. దీంతో బెయిల్‌ ఇవ్వాలని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్‌ వేశారు. బాలాజీ గోవిందప్ప తదితరులకు త్వరలో బెయిల్‌ ఖాయమని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. కాగా, కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సిట్‌ అధికారులను కోర్టు నిలదీస్తోంది. అందుకని సాంకేతిక అంశాలతో కోర్టును తప్పుదారి పట్టించేందుకు సిట్‌ కొత్త ఎత్తుగడ వేసింది. ఇటీవల సమర్పించిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో బాలాజీ గోవిందప్ప, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్‌ కొత్త పన్నాగం పన్నింది. వికాట్‌ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కార్యాలయం, బాలాజీ గోవిందప్ప నివాసంలో హఠాత్తుగా సోదాల డ్రామాకు తెరతీసింది. కోర్టు అనుమతి లేకుండానే 20 మందితో కూడిన సిట్‌ బృందం వికాట్‌ కంపెనీ కార్యాలయం వద్ద హంగామా చేసింది. సోదాలపై కోర్టు అనుమతి పత్రం చూపించాలన్న వికాట్‌ ఉద్యోగులతో సిట్‌ అధికారులు దురు­సుగా ప్రవర్తించారు. బలవంతంగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీస్‌ మార్క్‌ గూండాగిరితో భయపెట్టేందుకు ప్రయత్నించారు.బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న వికాట్‌ కంపెనీ కార్యాలయంలో సిట్‌ సోదాలు పక్కా పన్నాగమే. ఎందుకంటే, మే 13న అక్రమంగా అరెస్టు చేసే సమయంలోనూ ఇదే రీతిలో ఆయన నివాసంలో సిట్‌ అధికారులు రోజంతా సోదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో బాలాజీ గోవిందప్ప కుమారుడి ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లను జప్తు చేసి సిట్‌ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. ఆ వస్తువులు తనవి కావని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. సీజ్‌ చేసిన వస్తువులు తిరిగి అప్పగించాలని, సంబంధిత వ్యక్తులకు ఇచ్చేస్తామని కోరారు. ఇక ఆయన నివాసంలో గానీ, జప్తు చేసినట్టు ప్రకటించిన ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో గానీ సిట్‌ ఆధారాలు చూపలేకపోయింది. దాంతో సిట్‌ పన్నాగం ఫలించలేదు. 75 రోజులు రిమాండ్‌లో ఉన్నా సరే దర్యాప్తులో కనీస పురోగతి సాధించలేదు. కుంభకోణం జరిగితేనే కదా?లేని కుంభకోణం ఉన్నట్టు చూపించాలన్న సీఎం చంద్రబాబు కుట్ర క్షేత్రస్థాయిలో బెడిసికొడుతోంది. ఈ పరిణామాలన్నీ సిట్‌ దర్యాప్తు డొల్లతనాన్ని బట్టబయలు చేస్తు­న్నాయి. దాంతో బాలాజీ గోవిందప్ప బెయి­ల్‌ను అడ్డుకునేందుకు సిట్‌ వికాట్‌ కార్యాల­­యంలో సోదాలకు దిగింది. తద్వారా ఈ కేసు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని చెబు­తూ కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్‌ పన్నాగం. ఆ నెపంతో బాలా­జీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవాలన్నది లక్ష్యం.చెదిరిపోతున్న చంద్రబాబు కుట్రలురాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో 3.58 లక్షల జీబీల డేటాను వైఎస్సార్‌సీపీ వర్గీయులు నాశనం చేశారని... 375 పేజీల డేటాను డిలీట్‌ చేశారని ఈనాడు సహా ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. దీనిపై ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశారు. ‘‘అసలు మా వద్ద అలాంటి డేటానే ఏనాడూ లేదు. మేం ఎలాంటి డేటాను డిలీట్‌ చేయలేదు’’ అంటూ స్వయంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని బెవరేజెస్‌ కార్పొరేషనే లిఖితపూర్వకంగా తెలిపింది. అంటే, అక్రమ కేసుపై ఎల్లో మీడియా చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని నిర్ధారణ అయింది. చంద్రబాబు, లోకేశ్‌ సిట్‌ను అడ్డుపెట్టుకుని కట్టుకథలు అల్లుతూ... వందల కొద్దీ ఎల్లో యూట్యూబ్‌ చానళ్లను సృష్టించి, టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులను నిపుణులు, పాత్రికేయులుగా నమ్మిస్తూ భారీగా డబ్బులు ఎరవేసి విష ప్రచారం సాగిస్తున్నారని స్పష్టమైంది.పచ్చ గ్యాంగ్‌ దాదాగిరీ... పరిశ్రమలు పరార్‌రాజకీయ కుట్రలు, కక్షసాధింపు కుతంత్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి భారీ వసూళ్లు, దీనికోసం పరిశ్రమలపై దాడులు... ఇలా చంద్రబాబు ముఠా అరాచకాల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ధ్వంసమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలకు వేధింపులు తీవ్రమయ్యాయి. భారీగా ముడుపులు, కాంట్రాక్టుల కోసం పారిశ్రామికవేత్తలను చంద్రబాబు గ్యాంగ్‌ వేధిస్తోంది. దీంతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తి వెళ్లిపోతున్నారు. » వలపు వల వేసి బడాబాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జిందాల్‌ స్టీల్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇది తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టాలని నిర్ణయించిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలించింది.» సిమెంట్‌ దిగ్గజం వికాట్‌ గ్రూప్‌ యూరప్‌లో టాప్‌ కంపెనీల్లో ఒకటి. అంతటి ప్రతిష్ఠాత్మకఅంతర్జాతీయ కంపెనీలో బాలాజీ గోవిందప్ప పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనకు ఏపీతో గానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో గానీ ఏమాత్రం సంబంధం లేదు. కేవలం రాజకీయ కుట్రతోనే వికాట్‌ కంపెనీని, బాలాజీ గోవిందప్పను చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు.» కాకినాడ సీ పోర్టులో వాటాలు వదిలేసుకోవాలని అరబిందో గ్రూప్‌ను కూటమి ప్రభుత్వ పెద్దలు బెదిరించారు. లేదంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని సీఐడీనీ రంగంలోకి దించారు. దీంతో అరబిందో గ్రూప్‌ కాకినాడ సీ పోర్టులోని మెజారిటీ వాటాను వదిలేసుకోవాల్సి వచ్చింది.» అల్ట్రాటెక్‌ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా కాంట్రాక్టు కోసం ఏకంగా మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, టీడీపీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్గాలు పరస్పరం దాడులకు దిగి బెంబేలెత్తించాయి. దాంతో ఆ పరిశ్రమ యాజమాన్యం బెదిరిపోయింది.» పల్నాడులో భవ్య, చెట్టినాడ్‌ సిమెంట్‌ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతి బస్తాకు ఇంత అని కప్పం కట్టాలని గూండాగిరీకి తెగబడ్డారు. దీనికి ఒప్పుకోకపోవడంతో ఓ కంపెనీ ఉత్పత్తిని 50 రోజలు, మరో కంపెనీని 30 రోజులు అడ్డుకున్నారు.» శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి దాడి చేసి బెంబేలెత్తించారు. » రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వేధించారు. ఆ కంపెనీకి నిర్మాణ సామగ్రి సరఫరాను అడ్డుకున్నారు. » శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీపై కూటమి నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తనకు నెలనెలా కప్పం కడితేనే బీరు ఉత్పత్తుల లోడ్‌ లారీలను బయటకు అనుమతిస్తానని బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తేల్చి చెప్పారు. » సత్తెనపల్లి నియోజకవర్గం మీదుగా ప్రయాణించే గ్రానైట్‌ లారీల నుంచి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ వర్గీయులు కప్పం వసూలు చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యేగా పేరు పొందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో కేడీ ట్యాక్స్‌ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. » శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కియా భూములను కొల్లగొట్టేందుకు ఆ జిల్లా మంత్రి, అక్కడి టీడీపీ ఎమ్మెల్యే వర్గాలు కొట్లాటకు దిగాయి.» రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. » నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీ రెండో ప్లాంట్‌ పనుల్లో తమ నీటి ట్యాంకర్లను పెట్టుకోవడం లేదని టీడీపీ నేతలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్పనివాసంలో సిట్‌ సోదాలువికాట్‌ కార్యాలయాల్లో కూడా..2 ప్రత్యేక బృందాలతో ఐదున్నర గంటల పాటు సోదాలు సాక్షి, సిటీబ్యూరో: మద్యం అక్రమ కేసులో సిట్‌ అధికారులు ఏఎస్పీ స్నేహిత నేతృత్వంలో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని వికాట్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప నివాసంలో శనివారం సోదాలు నిర్వహించారు. సిట్‌ గతంలోనూ సుదీర్ఘంగా సోదాలు చేసినా.. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ కోర్టులో ప్రవేశ పెట్టలేకపోయింది. మరోవైపు ఏసీబీ కోర్టులో బాలాజీ గోవిందప్ప వేసిన బెయిల్‌ పిటిషన్‌ ఈ నెల 29న విచారణకు రానుందని, దానిని అడ్డుకునేందుకే సోదాల పేరుతో సిట్‌ అధికారులు కొత్త నాటకానికి తెరలేపారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బంజారాహిల్స్‌లోని వికాట్‌ కార్యాలయాల్లో సిట్‌ సోదాలు నిర్వహించింది. డీఎస్పీ శ్రీనివాస్, ఆరుగురు పోలీసుల బృందంతో కలిసి సుమారు ఐదున్నర గంటలు సోదాలు చేశారు. బాలాజీ గోవిందప్ప చాంబర్లు, పరిసర ప్రాంతాలను సోదా చేసినట్లు తెలిపారు. కొన్ని డిజిటల్‌ డివైజ్‌లను సీజ్‌ చేశామని, వాటిలో ఏముందనేది విచారణలో తేలుస్తామని డీఎస్పీ చెప్పారు. కాగా, సోదాలు నిర్వహించేందుకు వస్తున్నామని సిట్‌ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఎవరు సోదాలు నిర్వహిస్తున్నారనేది బంజారాహిల్స్‌ ఠాణా రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. కేవలం ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు మాత్రమే... బాలాజీ గోవిందప్ప నివాసం, వికాట్‌ ప్రధాన కార్యాలయంలో సోదాకు వస్తున్నట్లు రికార్డులో పేర్కొన్నట్లు సమాచారం.

Andhra Pradesh Govt Tops In Debts says Comptroller and Auditor General10
అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల జాతర అప్రతిహతంగా కొనసాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోని పలు రాష్ట్రాల ఆదాయ, వ్యయాలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించిన నివేదికల ప్రకారం బహిరంగ మార్కెట్‌లో రుణాలను ఏపీనే అందరికంటే ఎక్కువగా తీసుకుంటోంది. అప్పుల్లో ఏపీ రూ. 37 వేల కోట్లతో మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌ రూ. 26 వేల కోట్లే తీసుకోవడం గమనార్హం. కాగ్‌ ఇటీవల వెల్లడించిన నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత మూడు నెలల (2025 ఏప్రిల్, మే, జూన్‌) కాలంలో రూ.37.093 కోట్ల అప్పులను సేకరించింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఒకింత తక్కువే అయినా రూ. 20 వేల కోట్ల అప్పుల చిట్టాను దాటిపోయింది. తెలంగాణతో కొంచెం అటూ ఇటుగా కేరళ, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలుండగా, మధ్యప్రదేశ్‌ మాత్రం తెలంగాణ కంటే ఎక్కువగానే అప్పులు తీసుకుంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీ ఎవరికీ చిక్కనంత దూరంలో నిలిచింది. జాబితాలో ఏపీ తర్వాత తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. సగానికి చేరువగా...! వాస్తవానికి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇంత మొత్తంలో రుణాలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఈ మేరకు వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో ప్రతిపాదించి అసెంబ్లీ ఆమోదం తీసుకుని ఏడాదిపాటు ఆ రుణాలను క్రమంగా తీసుకుంటాయి. కానీ ఏపీ మాత్రం కేవలం మూడు నెలల కాలంలోనే ఏడాది మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న అప్పుల్లో దాదాపు సగం అప్పుడే తీసేసుకున్నట్లు కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం రూ.79,926.89 కోట్లను 2025–26 ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు కింద సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, అందులో 46.40 శాతం అంటే రూ. 37,093.98 కోట్లను అప్పుడే తీసేసుకుంది. ఇక, తెలంగాణ రూ. 54,009.74 కోట్ల రుణ సేకరణ లక్ష్యంగా పెట్టుకుని తొలి మూడు నెలల కాలంలో 37.52 శాతం అంటే రూ. 20,266.09 కోట్లను సమకూర్చుకుంది. తెలంగాణలో కొంచెం అటూ ఇటుగా...తెలంగాణ ఖజానా గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ముందుకెళ్తోంది. గత వార్షిక బడ్జెట్‌ లక్ష్యంలో తొలి మూడు నెలల్లో 17.80 శాతం నిధులు సమకూరగా, ఈసారి కొంచెం ఎక్కువగా 20.19 శాతం అంటే రూ.57,449 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయంలో గత ఏడాది లక్ష్యంతో పోలిస్తే తొలి మూడు నెలల్లో 16.10 శాతం రాగా, ఈ ఏడాది 35,721.80 కోట్లు (16.20%) వచ్చాయి. జీఎస్టీ, స్టాంపులు, రిజి స్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, పన్నేతర ఆదాయం...ఇలా అన్ని పద్దుల్లోనూ కొంచెం అటూ ఇటుగా 2024–25 ఆర్థిక సంవత్సరం మాదిరిగానే నిధులు సమకూరుతున్నాయని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అప్పులు మాత్రం ఈసారి ఒకింత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గత ఏడాది పెట్టుకున్న రుణలక్ష్యంలో తొలి మూడు నెలల్లో 26.74 శాతం సమకూర్చుకోగా, ఈసారి మాత్రం 37.52 శాతం రుణాలను తీసేసుకోవడం గమనార్హం. ఇక, ఆదాయ రాబడులు ఎలా ఉన్నాయో వ్యయ లెక్కలు కూడా అలాగే ఉన్నాయని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. అన్ని పద్దుల కింద కలిపి మొత్తం రూ. 57,499. 58 కోట్లు రాగా.. రూ.52,559.96 కోట్లు ఖర్చయ్యాయి. రూ.10,582.85 కోట్లు రెవెన్యూ లోటు నమోదు కాగా, రూ.20,266.09 కోట్ల ద్రవ్య లోటుతో తెలంగాణ ఖజానా ఉందని కాగ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement