పుతిన్‌ని తన పాటలతో విమర్శించే ఒక సంగీత కళాకారుడు అనూహ్యంగా మృతి చెందాడు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అతడి పాటలు మరింత పేరుగాంచాయి. ఈ మేరకు సంగీత కళాకారుడు 35 ఏళ్ల డిమా నోవా తన ముగ్గురు స్నేహితులు, సోదరుడితో కలిసి గడ్డకట్టిన వోల్గా నదిని దాటుతుండగా ప్రమాదవశాత్తు మంచులో పడి మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది రష్యా. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు బయటపడగా, మరోక స్నేహితుడు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం డిమా సోదరుడు రోమా, మరో ఇద్దరు స్నేహితులు మాత్రమే ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు.
ఐతే ఆ సంగీత కళాకారుడి పూర్తి పేరు డిమిత్రి స్విర్గునోవ్, పైగా అతను ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్రూప్ క్రీమ్ సోడా వ్యవస్థాపకుడు. అతను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని తరుచుగా విమర్శిస్తు పాటలు పాడేవాడు. అతను పాడిన పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిని వివాదాస్పదమైన పాట ఆక్వా డిస్కో ఉక్రెయిన్‌పై మాస్కో చేస్తున్న దాడికి వ్యతిరేకంగా జరిపిన నిరసనలో ఉపయోగించారు రష్యా ప్రజలు. దీంతో ఆ నిరసనలు కాస్త చివరికి డిస్కో పార్టీలుగా మారిపోయాయి.
అంతేగాదు ఆ గాయకుడు తన పాటలో పుతిన్‌కి సంబంధించిన పదివేల కోట్ల విలాసవంతమైన భవనాన్ని కూడా విమర్శించారు. పైగా ఈ పాట 'పుతిన్ ప్యాలెస్' పాటగా పేరుగాంచడమే గాక దీని గురించి ఒక రష్యన్ కమెడియన్ అలెగ్జాండర్ గుడ్‌కోవ్ సరదాగ కాసేపు మాట్లాడటంతో ఈ పాట మరింత విశేష ప్రజాదరణ పొందింది.
(చదవండి: ఇన్‌స్టంట్ కర్మ అంటే ఇదేనేమో!.. మొబైల్ కొట్టేద్దామనుకున్నాడు.. పాపం చివరికి)
Comments
Please login to add a commentAdd a comment