దుబాయ్ : సౌదీలో ప్రముఖ మహిళాహక్కుల కార్యకర్త లౌజైన్ అల్ హత్‌లౌల్‌కు సోమవారం సుమారు ఆరేళ్ల కారాగార శిక్ష విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. టెర్రరిజ వ్యతిరేక చట్టం కింద ఆమెకు శిక్ష పడినట్లు తెలిసింది. రెండున్నరేళ్లుగా ఆమె జైల్లోనే ఉన్నారు. అప్పటినుంచి ఆమె అరెస్టును హక్కుల సంఘాలు, యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, యూరోప్ చట్టసభల సభ్యులు నిరసిస్తూనే ఉన్నారు. సౌదీలో మహిళలకు డ్రైవింగ్ చేసే హక్కు ఉండాలని లౌజైన్ గతంలో పోరాడారు. ఆమెకు విధించి శిక్షపై అంతర్జాతీయ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శిక్షను వెంటనే రద్దు చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment