భారత రాజ్యాంగం.. సెక్యులర్‌ వ్యవస్థ | - | Sakshi

భారత రాజ్యాంగం.. సెక్యులర్‌ వ్యవస్థ

Mar 20 2025 1:27 AM | Updated on Mar 20 2025 1:27 AM

భారత

భారత రాజ్యాంగం.. సెక్యులర్‌ వ్యవస్థ

రాజ్యాంగ విలువలకు తిలోదకాలు

రాజ్యాంగ వ్యవస్థను గత 75 సంవత్సరాలుగా ప్రజలు గౌరవిస్తున్నారని, రాజ్యాంగానికి లోబడి రాజ్య పాలన నిర్వహించాలని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, హెచ్‌సీయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌ అన్నారు. కానీ నేడు పాలకులు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చి సొంత ఎజెండాతో పాలన కొనసాగిస్తున్నారన్నారు.

కేయూ క్యాంపస్‌ : భారత రాజ్యాంగం సెక్యులర్‌ భావాలతో కూడిన వ్యవస్థని, రాజ్యాంగం ఒక వ ర్గానిదో.. ఒక కులానిదో కాదని, దేశ ప్రజలందరిద ని తెలంగాణ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘ 75 సంవత్సరాల భారత రాజ్యాంగం– మైలురా ళ్లు– సమస్యలు– సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రతీ వ్యక్తి భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌తోపాటు రాజ్యాంగాన్ని కూడా అధ్యయనం చేయాలన్నారు. అప్పుడే రాజ్యాంగం విలువలు, తమ హ క్కులేమిటో తెలుస్తాయన్నారు. సమసమాజ ని ర్మాణం కోసం రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దేశ ప్రజల హక్కులను రక్షించేది రా జ్యాంగమేనని, రాజ్యాంగాన్ని సమగ్రంగా రచించి న గొప్ప వ్యక్తి బి.ఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. దేశ ప్రజలు అంబేడ్కర్‌కు రుణపడి ఉండాలన్నారు. రాజ్యాంగం వైరుధ్యాలను పరిష్కరిస్తుందన్నారు.

రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి..

భారత రాజ్యాంగం ప్రపంచంలో గొప్పదని మహబూబాబాద్‌ మాజీ పార్లమెంట్‌ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్‌ అన్నారు. చట్టసభల్లో అట్టడుగు వర్గాల వారు ప్రవేశించడానికి రాజ్యాంగంలో పే ర్కొన్న రిజర్వేషన్‌ విధానమే కారణమన్నారు. రా జ్యాంగానికి లోబడే ఎవరైనా వ్యవహరించాలేగాని రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తే ప్రతికూల ప్ర భావాలు చూపుతాయన్నారు. అనంతరం కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ ఆర్‌. మల్లికార్జున్‌ రెడ్డి, కేయూ ఎస్సీ,ఎస్టీ సెల్‌డైరెక్టర్‌, ఈ సెమినార్‌ డైరెక్టర్‌ తుమ్మల రాజమణి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌. నారాయణ మాట్లాడారు. లైబ్రరీ సైన్స్‌విభాగం అధిపతి రాధిక రాణి, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు

రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రయ్య

కేయూలో ముగిసిన జాతీయ సదస్సు

భారత రాజ్యాంగం.. సెక్యులర్‌ వ్యవస్థ1
1/2

భారత రాజ్యాంగం.. సెక్యులర్‌ వ్యవస్థ

భారత రాజ్యాంగం.. సెక్యులర్‌ వ్యవస్థ2
2/2

భారత రాజ్యాంగం.. సెక్యులర్‌ వ్యవస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement