స్టేషన్‌ఘన్‌పూర్: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా అన్నా రు. ‘పీఎం కృషి సించాయి యోజన 2.0’ పథకంలో భాగంగా సోమవారం తాటికొండ గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యాన చేపట్టిన వాటర్‌షెడ్ యాత్రను ప్రారంభించిన అనంతరం రైతు వేదికలో మాట్లాడారు. భూగర్భ జలాలు పెరిగితే సాగునీరు సమృద్ధిగా ఉండి పంటల విస్తీర్ణం, వృక్షసంపద, పచ్చదనం పెరుగుతుందన్నా రు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 35 ప్రాజెక్టుల ద్వారా 248 గ్రామాలు వాటర్‌షెడ్ పథకం కింద ఎంపికయ్యాయని, అందులో జిల్లాలోని తాటికొండ గ్రామం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పండ్ల తోటలు, అడవి మొక్కల పెంపకం పనులకు ఈజీఎస్ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తామ ని చెప్పారు. ఉపాధి పనులకు రోజుకు రూ.300 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వాటర్ షెడ్ పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.50వేల రుణ సదుపా యం కల్పిస్తున్నట్లు వివరించా రు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ వసంత, డీఏఓ రామారావునాయక్, డీవైఎస్‌ఓ వెంకట్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మారపాక రాములు, తహసీ ల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, ఏఓ చంద్రన్‌కుమార్, వాటర్‌షెడ్ పీఓ వీరన్న, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, టీఏ జాంబ, నరేష్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మీదికొండ గ్రామంలో వాటర్‌షెడ్ యాత్ర ప్రారంభించారు. డీఏఓ రామారావునాయక్, పీఆర్ ఏఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
తాటికొండలో వాటర్‌షెడ్ యాత్ర