ఆడతోడు కోసం..
ఆడపులి వాసనతో..
పదకొండు రోజులుగా మూడున్నరేళ్ల మగ పెద్దపులి ఆడపులి వాసనను పసిగడుతూ ప్రయాణం చేస్తుందని తెలిసింది. గోదావరి అవుతలి వైపున వేమనపల్లి మండలం నీల్వాయి అడవులకు ఓ ఆడపులి చేరి సంచరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇక్కడి మగపులి ఆడతోడు (మేటింగ్)కోసం అడవి అంతా గస్తీ చేస్తుంది. గోదావరి సరిహాద్దుల వరకు వెళ్లి తిరిగి వస్తుందని అటవీశాఖ అధికారుల ద్వారా తెలిసింది. కొన్ని కిలోమీటర్ల మేర ఉన్న పులులు వాటి వాసనను పసిగట్టి తోడు దరిచేరుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మూత్రం, పేడ వాసనను గుర్తించి దరికి చేరుతాయి. రెండు పులుల తోడు కోసం ఏదైనా గోదావరి దాటి కలిసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఆ దిశగా అధికారులు కూడా అన్వేషణ ప్రారంభించినట్లు తెలిసింది. కాటారం, మహదేవపూర్ మండలాల్లో దాడులు మాత్రం ఎక్కడా చేయలేదని తెలిసింది.
కాళేశ్వరం: పదకొండు రోజులుగా అటవీశాఖను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి పలుగుల నుంచి బీరాసాగర్‌కు ప్రయాణం ప్రారంభించింది. ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తూర్‌పల్లి నుంచి మొదలైన పులి సంచారం వీరాపూర్ గుడూర్, గుండ్రాత్‌పల్లి, కుదురుపల్లి, బీరాసాగర్, అన్నా రం మీదుగా మహదేవపూర్ మండలం మద్దులపల్లి, పలుగుల వరకు కలియ తిరిగింది. గారెకుంట ఒర్రెలో మకాంవేసి గురువారం ఉదయం మళ్లీ పలు గుల మీదుగా అటవీప్రాంతం గుండా కాళేశ్వరం సమీపంలోని గ్రావిటీ కెనాల్ రోడ్డుపై పులి నడచుకుంటూ వెళ్లిన పాదముద్రలు స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
బీరాసాగర్‌లో కెమెరాలు..
మహదేవపూర్ రేంజ్ అధికారులు నాలుగు బృందాలతో పాటు ఎనిమల్ ట్రాకింగ్ టీంలతో కలిసి అన్వేషణ ప్రారంభించారు. సాయంత్రం వరకు బీరాసాగర్ అడవిలో పాదముద్రలు లభించారు. దీంతో అక్కడా ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గోదావరితీరం, సమ్మక్క–సారలమ్మ గద్దెలు, నీటికుంటల వద్ద ఆరు కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఇంద్రావతి టు గోదావరితీరం..
పులుల సంచారం ఇంద్రావతి రిజర్వుఫారెస్టులో ఎక్కువగా ఉంది. ఛత్తీస్‌గఢ్ వైపున మావోయిస్టు ప్రాబల్యం ఉండడంతో పులుల గణన జరుగలేదని తెలిసింది. అక్కడి నుంచి ఇంద్రావతి దాటి గోదావరి తీరం వైపునకు ప్రయాణం చేసినట్లు వాదనలు వినిపిస్తుంది. ఇంద్రావతి వద్ద పలిమెల, మహదేవపూర్ మీదుగా కాటారం నుంచి మళ్లీ బీరాసాగర్ చేరిన పులి అటు వెళ్లడానికి ప్రయత్నించిందా అనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే పెద్దపులిని ప్రత్యక్షంగా చూశారు. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కలేదు. దీంతో సంచారం భయంతో ప్రజలు రాత్రిపూట ప్రయాణాలు చేయడం లేదు. ఎఫ్‌ఎస్‌ఓ ఆనంద్‌ను సంప్రదించగా బీరాసాగర్‌కు పులి వచ్చినట్లు పాదముద్రలు సేకరించినట్లు తెలిపారు. అడవి మొత్తం సంచరిస్తుందని, ఒక్క దగ్గర నిలకడగా ఉండడం లేదని తెలిపారు.
మంచిర్యాల జిల్లా నీల్వాయికి ఆడ పులి రాక
ఆ వాసనతోనే అడవిలో తచ్చాడుతున్న మగపులి
పదకొండు రోజులుగా మకాం
Comments
Please login to add a commentAdd a comment