ములుగు: సైబర్ నేరాల్లో భాగంగా జరుగుతున్న డిజిటల్ అరెస్టులపై జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ ఎదుట గురువారం సేయింట్ ఆంథోనీస్ విద్యార్థినులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఖాతాదారులకు అవగాహన కల్పించారు. పరిచయంలేని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌లను రిసీవ్ చేసుకోవద్దన్నారు. బ్యాంకు అకౌంట్, ఓటీపీ వివరాలను వెల్లడించకూడదని ఖాతాదారులకు ప్లకార్డుల ద్వారా వివరించారు. బ్యాంకు ఖాతాలు, సైబర్ నేరాలపై ఎలాంటి ఇబ్బందులు వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాధు చేయాలని స్కీట్ రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యేరవ కవితరెడ్డి, హెచ్‌ఎం కందాల రమేష్, డైరెక్టర్ వెంకటప్పారెడ్డి, బొల్లం రవి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment