కలెక్టర్ హాస్టల్ నిద్ర
● విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం
మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాహుల్‌శర్మ శుక్రవారం రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రించారు. అంతకుముందు ఆయన భోజనశాల, ఆహార పదార్థాల నిల్వలు, వంటకాలను పరిశీలించారు. సమస్యలను ప్రిన్సిపాల్ శారదను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సూచించారు. మీకు మీరే పోటీపడాలని చెప్పారు. పరీక్షలు అంటే భయం లేకుండా మానసికంగా సిద్ధం కావాలని సూచించారు. అనంతరం టెన్త్ విద్యార్థుల స్టడీ అవర్‌లో పాల్గొని పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి సునీత, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ హుస్సేన్, ఆర్‌ఐ సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్ ఉన్నారు.
కలెక్టర్ హాస్టల్ నిద్ర
Comments
Please login to add a commentAdd a comment