
పెరిగిన టోల్ చార్జీలు
కాటారం: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన టోల్‌చార్జీల సవరణతో టోల్ చార్టీల పెంపు మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. 353(సీ) జాతీయ రహదారిపై కాటారం మండలం మేడిపల్లి వద్ద నిర్వహిస్తున్న టోల్‌గేట్‌లో పలు వాహనాలకు సంబంధించిన టోల్‌చార్జీలు రూ.5నుంచి రూ.20 మధ్య పెరిగినట్లు టోల్‌గేట్ సూపర్‌వైజర్ మునీర్ తెలిపారు. కారు, జీప్‌లకు రిటర్న్ జర్నీకి సంబంధించి ఫాస్ట్‌గా హోల్డర్స్‌కు రూ.15 చార్జ్ చేస్తుండగా ప్రస్తుతం రూ.20కి నాన్ ఫాస్టాగ్ హోల్డర్స్‌కు రిటర్న్ జర్నీకి రూ.30 ఉండగా రూ.35కి పెరిగింది. మిగితా వాహనాల సైజ్‌ను బట్టి రూ.5నుంచి రూ.20 పెరిగినట్లు సూపర్‌వైజర్ పేర్కొన్నారు. పెరిగిన టోల్‌చార్జీలు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి.