
కాలసర్ప నివారణ పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శని పూజలకు భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామివారి ఆలయంలో సామూహికంగా పూజలు నిర్వహించారు. కొంతమంది భక్తులు నవగ్రహాల వద్ద శనిపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తులతో సందడి వాతావరణం కనిపించింది.