సొరంగం సెగ్మెంట్ బిగిస్తుండటంతో ఏర్పడిన రంధ్రాల ద్వారా నీటి ఊట టన్నెల్‌లోకి అధికమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఏర్పాటు చేసిన మోటార్లు సరిపోవడం లేదు. టన్నెల్‌లోకి నీట ఊట అధికమవడంతో ఐదు అదనపు మోటార్లను, ప్రత్యేకంగా పైపులను ఏర్పాటు చేసి.. నీటిని తోడేస్తున్నారు. బురద గట్టి పడటంతో సింగరేణి కార్మికుల వద్ద ఉన్న పారలు సైతం వాడకంలోకి రావడం లేదు. దీంతో అదనంగా గడ్డపారలు తెప్పించారు. పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్లు వాడుతున్నారు. ఊట నీటిని, మట్టిని తొలగిస్తేనే చిక్కుకున్న వారి అవశేషాలు వెలికితీసేందుకు వీలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment