జేఎన్‌టీయూకేలో వర్క్‌షాపు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ప్రేమ్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)అనేది విద్యా సంస్థల ప్రమాణాలకు ర్యాంకింగ్ లాంటిదని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ కె.రామ్మోహనరావు పేర్కొన్నారు. జేఎన్‌టీయూకేలో సోమవారం డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మశీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్లకు ‘ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ 2025లో మెరుగైన పనితీరు, వ్యూహాత్మక విధానం’ అనే అంశంపై ఒక రోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మెహనరావు మాట్లాడుతూ ఎన్‌ఐఆర్‌ఎఫ్ అనేది లీడర్‌షిప్ ప్రొఫెషన్‌కు పరీక్ష లాంటిదని, విద్యాసంస్థ నాణ్యత ప్రమాణాలను ప్రతిబింబిస్తుందన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తరుణంలో అధ్యాపకులకు, విద్యార్థులకు అంతరం ఏర్పడుతుందని, దీనిని అధిగమిస్తే అధ్యాపకులు సాంకేతిక మార్పులను అర్థం చేసుకోవాలన్నారు. రానున్న ఐదేళ్లకాలంలో మన రాష్ట్రంలో 15 నుంచి 20 వరకూ విదేశీ వర్సిటీలు ఏర్పాటుకానున్నాయని, అలాగే 20 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాధ్, మాజీ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, ఐక్యూఎసీ కో–ఆర్డినేటర్ కృష్ణప్రసాద్, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆర్.మధు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment