
హనుమాన్ యాత్రను విజయవంతం చేయాలి
కామారెడ్డి టౌన్: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆధ్వర్యంలో జరిపే వీర హనుమాన్ విజయయాత్రను విజయవంతం చేయాలని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం తెలిపారు. శుక్రవారం స్థానిక ధర్మశాలలో వారు మాట్లాడారు. పట్టణంలోని కోడూరి హనుమాన్ ఆలయ నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందని పుర వీధుల గుండా ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. హనుమాన్‌దీక్ష స్వాములు, భక్తులు,యువకులు, హిందువులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ విభాగ్ సంపర్క్ గోపాలకృష్ణ, జిల్లా కార్యదర్శి బోల్లి రాజు, బజరంగ్‌దళ్ జిల్లా సంయోజక్ అశోక్, పట్టణ అధ్యక్షుడు వడ్ల వెంకట స్వామి, కార్యదర్శి వంగ ప్రసాద్, జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీకాంత్ రావ్, విశ్వం గుప్తా, పాపారావు, మంచాల రాజు, భాస్కరాచారి, తదితరులు పాల్గొన్నారు.