
వరంగల్ సభను జయప్రదం చేయాలి
నిజాంసాగర్(జుక్కల్): ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లి వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింథే అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వరంగల్ సభకు జనసమీకరణ ఏర్పాట్లపై ముఖ్యనాయకులతో చర్చించారు. జుక్కల్ నియోజకవర్గం నుంచి 3వేల మంది కార్యకర్తలను వరంగల్ సభకు తరలిస్తున్నామన్నారు. మండల నాయకులు దుర్గారెడ్డి, గైని. విఠల్, నర్సింహారెడ్డి, రమేష్‌గౌడ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.