కౌశిక్‌ ప్రమాణానికి సిద్ధమా? | - | Sakshi
Sakshi News home page

కౌశిక్‌ ప్రమాణానికి సిద్ధమా?

Published Tue, Jun 25 2024 12:14 AM | Last Updated on Tue, Jun 25 2024 12:14 AM

కౌశిక్‌ ప్రమాణానికి సిద్ధమా?

హుజూరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఉద్యోగాలు, ఇసుక మాఫియా, రైస్‌మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, దానికి సంబంధించిన ఆధారాలతో మంగళవారం ఉదయం 11గంటలకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని చెల్పూర్‌ ఆంజనేయస్వామి వద్దకు వస్తున్నామని, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కూడా డబ్బులు తీసుకోలేదని వచ్చి ప్రమాణం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ సవాల్‌ విసిరారు. సోమవారం హుజూరాబాద్‌లో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పబ్లిసిటీ కోసమే మంత్రి పొన్నం ప్రభాకర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బూడిదస్కాంలో గతంలోనే కౌశిక్‌రెడ్డికి సమాధానం చెప్పామని, ఆధారాలుంటే తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కౌశిక్‌రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎన్ని విమర్శలు చేసినా ఆకాశం మీద ఉమ్మినట్టే అవుతుందన్నారు. కౌశిక్‌రెడ్డి ప్రభుత్వాధికారులను బ్లాక్‌బుక్‌ ఉందని బెదిరిస్తున్నారని, మొన్నటిదాకా రెడ్‌బుక్‌ అన్నారని, ఇప్పుడు బ్లాక్‌బుక్‌ అంటున్నారని ఇకపై పింక్‌బుక్‌ దగ్గర పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పీసీసీ మెంబర్‌ పత్తి కృష్ణారెడ్డి, సొల్లుబాబు, పూదరి రేణుక శివ, వేముల పుష్పలత, కొలిపాక శంకర్‌, అఫ్సర్‌, తవుటం రవీందర్‌, కొల్లూరి కిరణ్‌, పుల్లూరు సదానందం, గుడెపు సారంగాపాణి, సాహెబ్‌ హుస్సేన్‌, సుశీల, రాధ, లావణ్య, దేశిని ఐలయ్య పాల్గొన్నారు.

పొన్నంపై ఆరోపణలు సూర్యుడిపై ఉమ్మేసినట్లే..

కాంగ్రెస్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement