జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌కు పారమిత విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌కు పారమిత విద్యార్థి

Published Tue, Jun 25 2024 12:14 AM | Last Updated on Tue, Jun 25 2024 12:14 AM

జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌కు పారమిత విద్యార్థి

కొత్తపల్లి(కరీంనగర్‌): పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్‌ పాఠశాలకు చెందిన శుభశ్రీ సాహు తన శాసీ్త్రయ ఆవిష్కరణకు గానూ న్యూఢిల్లీలో జరగనున్న ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డ్‌ నేషనల్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొనేందుకు ఎంపికై నట్లు ఆ పాఠశాల చైర్మన్‌ డా.ఇ.ప్రసాదరావు తెలిపారు. విజేతలు జాతీయస్థాయి అవార్డును అందుకోవడంతో పాటు విద్యా మంత్రిత్వశాఖతో సత్కరించబడతారని పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (ఫైన్‌)లో పాల్గొనే అవకాశాన్ని అగ్రశ్రేణి విజేతలు పొందుతారని తెలిపారు. సాకురా మార్పిడి కార్యక్రమం కింద జపాన్‌ సందర్శించడానికి ఆహ్వానించబడతారన్నారు. శుభశ్రీ తన మార్గదర్శి లలిత్‌ మోహన్‌ సాహు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డ్‌ మనక్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో తన వినూత్న ప్రాజెక్ట్‌ శ్రీమల్టీ ఫంక్షనల్‌ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మెషిన్‌శ్రీను ప్రదర్శించగా రాష్ట్రస్థాయికి తదనంతరం జాతీయ స్థాయికి ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు. శుభశ్రీ ప్రాజెక్టుతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి 26 ప్రాజెక్టులు ఎంపికై నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని డీఈవో జనార్దన్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి జయపాల్‌రెడ్డి అభినందించారు. పారమిత డైరెక్టర్లు ప్రసూన, అనూకర్‌ రావు, రశ్మిత, ప్రాచీ, రమణ, రాకేశ్‌, వీయూఎం.ప్రసాద్‌, వినోద్‌రావు, హెచ్‌ఎం రితేశ్‌మెహతా, ప్రోగ్రాంహెడ్‌ గోపికృష్ణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement