శివాజీనగర: అక్రమ సంపాదన, అక్రమ నగదు బదిలీ ఆరోపణల కింద సీనియర్ ఐఏఎస్ అధికారి కపిల్ మోహన్ భార్య రిచా సక్సేనాకు ఈడీ జారీ చేసిన సమన్లను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
ఏమిటీ కేసు...
హుబ్లీలోని క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడిన ఇద్దరు బుకీలు ఇచ్చిన సమాచారం ప్రకారం రిచా సక్సేనాను నిందితులుగా చేర్చి ఆమె నివాసంలో సోదాలుచేశారు. రిచా సక్సేనా ఇంటిలో రూ.4.7 కోట్ల నగదు, 2.5 కేజీల బంగారం, వజ్రాభరణాలు లభించాయని ఈడీ అప్పట్లో ప్రకటించింది. కానీ ఈ కేసులో నేరారోపణకు సాక్ష్యాలు లేవని పోలీసులు కోర్టుకు బీ– రిపోర్ట్ సమర్పించారు. 2021 ఏప్రిల్ 20న కోర్టు వాదనలు విని బీ రిపోర్ట్ ఆమోదించి, కేసును మూసివేసింది. ఇంతలో ఈ కేసులో విచారణకు రావాలని ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేయడంతో వీటిని కొట్టివేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును మూసివేసిన తరువాత ఈడీ మళ్లీ విచారణకు పిలవడం భావ్యం కాదని ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment